ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి వివాహితపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: హైదరాబాదు శివారులో ఓ వివాహితపై సాముహిక అత్యాచారం జరిగింది. హైదరాబాదు సమీపంలోని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల కుంట్లూరులో బీహార్ రాష్ట్రానికి చెందిన దంపతులు నివసిస్తున్నారు.
కాగా, సోమవారం అర్ధరాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో అగంతకులు ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం కత్తులతో బెదిరించి వివాహితపై సాముహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున విషయం తెలుసుకున్న ఆ వివాహిత బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తైక్వాండో కోచ్ నవనీతకు వేధింపులు
హైదరాబాదులోని నాగోల్‌లో తైక్వాండో కోచ్ నవనీతకు కొందరు యువకులు వేధించారు. ఇంటి ముందు మద్యం తాగవద్దని అన్నందుకు యువకులు పవన్, రామకృష్ణలు నవనీతను లైంగికంగా వేధించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు నిందితులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ట్యాంకర్ బోల్తాపడి ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం రావనకోల్ సైదోనిగడ్డ తండా దగ్గర ట్యాంకరు బోల్తా పడి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మృతులను నల్గొండ జిల్లా తుర్కపల్లికి చెందిన కుమార్, మేడ్చల్‌కు చెందిన జగదీష్‌లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.












Click it and Unblock the Notifications