తెలంగాణలో రూ.11,000 కోట్లతో బిగ్ రోడ్ ప్రాజెక్ట్స్

రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెలంగాణ ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. రోడ్ల నిర్మాణం, వాటి మరమ్మతులు, కొత్త మార్గాలను అందుబాటులోకి తీసుకుని రావడం, మారుమూల ప్రాంతాలకూ ఈ సౌకర్యాన్ని కల్పించే దిశగా ముందడుగు వేసింది. దీనికోసం వేల కోట్ల రూపాయలను వ్యయం చేయనుంది. 2026 నాటికి ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసే దిశగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది.

రోడ్ల నిర్మాణంపై ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 400 రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును 32 ప్యాకేజీలుగా విభజించి, మొత్తం 11,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

Massive Boost for Telangana Roads as 400 roads to develop by Rs 11000 Cr Under Hybrid Annuity Model

వచ్చే నెలలో టెండర్లను ఖరారు చేస్తామని, వచ్చే ఏడాది పనులు ప్రారంభమౌతాయని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే రోడ్ల నాణ్యత, కనెక్టివిటీలో తెలంగాణ.. దేశంలోని ఇత రాష్ట్రాలన్నింటికీ కూడా ఆదర్శంగా మారుతుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అద్దాల్లాంటి రహదారులతో తెలంగాణను తీర్చిదిద్దడానికి తాము కట్టుబడి ఉన్నామని, ఈ ప్రాజెక్ట్ అమలులో పూర్తి పారదర్శకతను పాటిస్తామని, అత్యుత్తమ నాణ్యతతో వాటిని డెవలప్ చేస్తామని అన్నారు.

హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గ్రేడ్ 1 వంటి వాళ్లే కాకుండా చిన్న కాంట్రాక్టర్లు కూడా ఇందులో పాల్గొనవచ్చని, బిల్లుల పెండింగ్ భయాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. బిల్లులు సకాలంలో విడుదల కావడంపై చిన్న కాంట్రాక్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటిని త్వరితగతిన విడుదల చేస్తామని పేర్కొన్నారు.

తన మంత్రిత్వ శాఖలో 100 కోట్ల రూపాయల విలువైన పెండింగ్‌ బిల్లులను క్లియర్ చేశామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మరో 50 కోట్ల రూపాయలను త్వరలో విడుదల చేస్తామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లింపులు అందక చాలా మంది చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడ్డారని, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్తున్నారని, మిగిలిన అన్ని బకాయిలను త్వరలో పరిష్కరిస్తామని వెంకటరెడ్డి హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+