తెలంగాణ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు- తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డొట్టిగూడెం- పెద్దకందుకూరు గ్రామంలో ఉన్న బృందావన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కొద్దిసేపటి కిందటే ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది. పారిశ్రామిక పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను తయారు చేస్తుంది. కంపెనీ ఆవరణలో రెండు రియాక్టర్లు ఒక్కసారిగా పెను శబ్దంతో పేలిపోయాయి. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ మరణాన్ని అధికారులు ఎవరూ నిర్ధారించలేదు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

Massive Radiator Blast Explosion at Telangana Chemical Plant Leaves Injures several Triggers Panic

గాయపడిన వారిలో కంపెనీకి చెందిన ఇద్దరు భద్రతా సిబ్బందితో పాటు నలుగురు ఇతర కార్మికులు ఉన్నారని సమాచారం. ఫ్యాక్టరీ ప్రాంగణంలో కార్మికులు మెగ్నీషియం, ఇతర రసాయనాలతో కలుపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 11 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదకర పదార్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే పేలుడు జరిగిందని భావిస్తున్నారు.

సమాచారం అందిన వెంటనే చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక, అగ్నిమాపక కార్యకలాపాలను పర్యవేక్షించారు. 10 అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. దాదాపు మూడు గంటల పాటు నిరంతరాయంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకుని వచ్చారు. బాధిత కుటుంబాల ఫిర్యాదు ఆధారంగా ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+