రాజ్యసభలో దత్తన్న మెటర్నిటీ సవరణ బిల్లు: ప్రయోజనాలివీ

న్యూఢిల్లీ: మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 సవరణ బిల్లును కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందితే 18 నెలలు అంతకన్నా ఎక్కువగా ప్రసూతి సెలవులు ఇస్తున్న 42 దేశాల సరసన భారత్ కూడా చేరనుంది.

ఈ బిల్లు ఆమోదం మహిళా ఉద్యోగులకు నిజంగా శుభవార్తే. ప్రస్తుతం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న 12 వారాల ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచుతూ కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు ప్రసూతి ప్రయోజనాల చట్టంలో జరిపిన సవరణలకు ఆమోదం తెలిపింది.

ఈ బిల్లు వల్ల సంఘటిత రంగంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న 18 లక్షల మంది మహిళా ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైన ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1961లో సవరణల కోసం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ప్రసూతి ప్రయోజనాల సవరణ బిల్లు, 2016కు కేబినెట్ అంగీకరించిందని తెలిపారు.

 Maternity bill to be taken up in Parliament today

అనంతరం ఈ బిల్లును బుధవారం మంత్రి బండారు దత్తాత్రేయ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ కార్మికులు ఎక్కువ పనిచేసి ఎక్కువ ఆర్జించడానికి బిల్లు దోహదపడుతుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ కార్మిక సంస్ధ ప్రమాణాలు, నింబధనలకు ఇది విరుద్ధం కాదన్నారు.

రోజులో పనిగంటల పరిమితి 10కి మించదని, అదనపు పనిగంటలతో కలుపుకుంటే వారానికి పనిగంటలు 60కి మించదని సూచించారు. ఉపాధి కల్పన పెంపు దిశగా ఈ బిల్లు దేశానికి అవసరమని, కార్మికులు రెట్టింపు వేతనాలు పొందేందుకు ఓ ప్రోత్సాహకమని వ్యాఖ్యానించారు.

'ప్యాక్టరీల చట్టం-1948'ను సవరించేందుకు త్వరలోనే సమగ్ర బిల్లును తీసుకొస్తామన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం పారిశ్రామిక వర్గాల మేరకే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందటూ సభ నుంచి వాకౌట్ చేయగా అనంతరం లోక్‌సభ బిల్లును ఆమోదించింది.

సవరణ బిల్లు ప్రకారం.. ఇద్దరు పిల్లల వరకూ ప్రసూతి సెలవు 26 వారాలు, ఇద్దరికన్నా ఎక్కువమంది పిల్లలకైతే 12 వారాల ప్రసూతి సెలవు లభిస్తుంది. పిల్లలను దత్తత తీసుకున్న మహిళకు కూడా 12 వారాల సెలవు లభిస్తుంది. పది లేదా అంతకుమించి ఉద్యోగులున్న అన్ని కంపెనీలు, సంస్థలకు కొత్త నిబంధన వర్తిస్తుంది.

మెటర్నిటీ సవరణ బిల్లు ప్రయోజనాలివీ:

* మహిళా ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసేవిధంగా వీలు కల్పించడం
* ప్రపంచ వ్యాప్తంగా మహిళా ఉద్యోగులు 40 శాతం ఉండగా భారత్‌లో24 శాతంగా ఉంది. ఇది మరితంగా పెరిగే అవకాశం.
* రూరల్ ప్రాంతాల్లో మహిళా ఉద్యోగులు సంఖ్య మరితంగా పెరిగే అవకాశం.
* శిశువులకు బ్రెస్ట్ ఫీడింగ్ కోసం మహిళలకు కొంత సమయం కేటాయింపు
* మన దేశంలో పిల్లల పెంపకం అనేది తల్లి బాధ్యతగా ఉంది. ఈ బిల్లు ద్వారా దానిని సాధ్యమైనంత వరకు తగ్గించే ఆవకాశం.
* కంపెనీల్లో మహిళలకు అదనపు సదుపాయాలు కల్పించడం
* ఉద్యోగ ప్రదేశాల్లో మహిళలను ప్రోత్సహించడం
* ఈ బిల్లు వల్ల మహిళలకు అనుగుణంగా వర్కింగ్ అవర్స్ కేటాయించే అవకాశం
* కంపెనీల్లో మహిళలు పెట్టుబడులు రిటర్న్ తెచ్చేలా దోహదం
* 50 లేదా అంతకన్నా ఎక్కువమంది ఉద్యోగులున్న కంపెనీ తప్పనిసరిగా చిన్నారుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
* త్రైమాసికానికి అదనపు పనిగంటల పరిమితి 100కు పెంపు. ప్రస్తుతం ఈ పరిమితి 50గా ఉంది.
* ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ పరిమితిని 125కు పెంచడానికీ అనుమితిస్తుంది.
* అదనపు పనిగంటలకు సంబంధించిన నిబంధనలకు మినహాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికి అధికారాలు కల్పిస్తుంది.
* ఓవర్‌టైమ్ పనిగంటలను పెంచడం
* ఫ్యాక్టరీల చట్టంలోని 64వ సెక్షన్ ప్రకారం ఇప్పుడున్న 50 ఓవర్‌టైమ్ పనిగంటలను 100 గంటలకు (మూడునెలలకు), సెక్షన్ 65 ప్రకారం ఇప్పుడున్న 75 ఓవర్‌టైమ్ పనిగంటలను 125 గంటలకు (మూడునెలలకు) పెంచింది.
* ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తున్నది
* భార్య/ భర్త, పిల్లల ఆస్తులను కూడా వెల్లడించాలన్న నిబంధన నుంచి కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛందసంస్థల ఉద్యోగులకు మినహాయింపు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+