వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్‌ కేసులను సీబీఐకివ్వాలి, ఆ ఎమ్మెల్యేలను విచారించాలి: మత్తయ్య

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసుతో పాటు ఫోన్‌ ట్యాపింగ్ కేసును కూడ విచారణ చేయాలని మత్తయ్య డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసును సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏసీబీ కేసులపై తెలంగాణ సీఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించిన సమయంలో ఓటుకు నోటు కేసు మరోసారి తెరమీదికి వచ్చింది.. ఈ తరుణంలో మత్తయ్య ఈ విషయమై తెలంగాణ సీఎం కెసిఆర్‌కు పది ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఓటుకు నోటు కేసులో ఉద్దేశ్యపూర్వకంగానే తన పేరును చేర్చారని మత్తయ్య ఆరోపించారు. తనపై కేసును రీ ఓపెన్ చేసి వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన చెప్పారు.

ఓటుకు నోటు కేసును సీబీఐతో విచారించాలి

ఓటుకు నోటు కేసును సీబీఐతో విచారించాలి

ఓటుకు నోటు కేసును సీబీఐతో విచారణ చేయించాలని మత్తయ్య డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసుపై సమీక్ష చేసిన తెలంగాణ సీఎం కెసిఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే ఓటుకు నోటు కేసుతో పాటు ఫోన్‌ ట్యాపింగ్ కేసును కూడ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ రెండు కేసులను సీబీఐతో విచారణ చేయించాలని కెసిఆర్‌ను మత్తయ్య కోరారు.

ఆ వీడియోలు ఎందుకు లీక్ చేశారు

ఆ వీడియోలు ఎందుకు లీక్ చేశారు

స్ట్రింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలను ఎందుకు మీడియాకు లీక్ చేశారని మత్తయ్య ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ప్రమేయం ఉన్నవారందరినీ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన సోదరుడి బంధువులపై కూడ దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో తన పేరును ఉద్దేశ్యపూర్వకంగా ఏ 4 చేర్చారని మత్తయ్య చెప్పారు. జిమ్మిబాబు పేరును తప్పించారని ఆయన ఆరోపించారు.

కోవర్టుగా మారాలని బెదిరింపులు

కోవర్టుగా మారాలని బెదిరింపులు

తనను కోవర్టుగా మారాలని బెదిరింపులకు పాల్పడ్డారని మత్తయ్య చెప్పారు. ఓ మంత్రి గన్‌మెన్‌ తనను కోవర్టుగా మారాలని బెదిరింపులకు దిగాడని మత్తయ్య ఆరోపించాడు. క్రిస్టియన్ నామినేటేడ్ ఎమ్మెల్యేను ఈ కేసులో బలిపశువును చేశారని ఆయన ఆరోపించారు.

ఆ ఎమ్మెల్యేలను విచారించాలి

ఆ ఎమ్మెల్యేలను విచారించాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగిన ఎమ్మెల్యేలందరిని కూడ ఓటుకు నోటు కేసులో విచారణ చేయాలని మత్తయ్య డిమాండ్ చేశారు.ఓట్లడిగిన ఎమ్మెల్యే సంభాషణలపై విచారణ చేయాల్సిందేనని మత్తయ్య డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వివరాలు కావాలని ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని కోరినా ఇవ్వలేదన్నారు.

English summary
Mathaiah demaded Telangana chief minister KCR to order CBI enquiry on cash for vote and phone tapping cases. He spoke to media on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X