కానిస్టేబుల్ ఉద్యోగానికి అత్యధికులు ఎంబీఏలు, ఎంటెక్‌లు చదినవారే..!
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖను మరింతగా బలోపేతం చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న వారిపై పని ఒత్తిడిని తగ్గించేందుకు వివిధ భాగాల్లో 9,281 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆనలైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తుల సంఖ్య ఇప్పటికే 2 లక్షలకు చేరుకుంది.
అంతేకాదు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అత్యధిక మంది ఇంటర్‌తో పాటు డిగ్రీ, ఎంబీఏ, ఎంటెక్, ఎం.ఫార్మసీ, బీటెక్, బి.ఫార్మసీ తదితర ఉన్నత విద్యాకోర్సులను అభ్యసించినవారే ఉండటం విశేషం. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భద్రత లేకపోవడం వల్లనే యువతరం ఈ రంగం వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ పోలీసు శాఖ కూడా ఉన్నత విద్యావంతులైన యువత వస్తుండటంతో వారి ఆలోచనా విధానానికి తగ్గట్లుగా శిక్షణ ఇచ్చి మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత సిబ్బందికి తోడు త్వరలో మరో పది వేల మంది కానిస్టేబళ్లు వచ్చి చేరుతున్నారు. సమీప కాలంలోనే ఎస్సై పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన వెలువడనుంది.

మొత్తంగా కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలో సుమారు 15 వేల యువ సిబ్బంది పోలీస్ శాఖలో చేరనున్నారు. ప్రస్తుత సిబ్బందిలో కొంత వయస్సు పైబడ్డవారు, పని ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కొత్త వారి రాకతో రాష్ట్ర పోలీసింగ్‌లో మార్పు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు పోలీస్ శాఖలో ప్రతి అంశాన్ని టెక్నాలజీతో ముడిపెట్టడమే కాకుండా సిబ్బంది మ్యాన్యువల్‌గా చేయాల్సిన పనులు, అందు కోసం వారికి ఇవ్వాల్సిన శిక్షణపై రాష్ట్ర పోలీస్ శిక్షణా సంస్ధ అధికారులు దృష్టి సారించారు. గత పరిస్థితులు, ప్రస్తుత, భవిష్యత పరిస్థితుల్ని అంచనా వేసి ఇకపై వచ్చే వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలన్నదానిపై అధికారులు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేశారు.
హైదరాబాద్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రంలో రెండు రోజుల క్రితం అకాడమీ ప్రస్తుత, మాజీ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం టెక్నాలజీపైనే పూర్తిగా ఆధారపడకుండా చట్టాలు, దర్యాప్తు తీరుపై సిబ్బందిని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసేలా ప్రణాళిక రూపొందించారు.
ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఆశయంతో పోలీస్ శాఖ వైపు వస్తున్న వారికి విలువలు, నైతికత , దృక్పథం వంటి అంశాలతో కూడిన ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇక పోలీస్ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన కల్పించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications