ఎంబీఎస్ జ్యూవెలర్స్ ఎండి సుఖేష్ గుప్తా అరెస్ట్; ఈడీదాడుల్లో బయటపడ్డ వందల కోట్ల అక్రమాలు!!
ఎంబీఎస్ జ్యూవెలర్స్ ఎండి సుఖేష్ గుప్తాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. రుణాల ఎగవేత, ఫెమా నిబంధనల ఉల్లంఘనతో సహా పలు ఆరోపణలపై సుఖేష్ గుప్తాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.

ఎంబీఎస్ జ్యూవెలర్స్ ఎండి సుఖేష్ గుప్తా ఆరు కేసుల్లో మోస్ట్ వాంటెడ్
ముసద్దిలాల్ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుఖేష్ గుప్తా బంగారం వ్యాపారం చేస్తూ అక్రమాలకు పాల్పడిన అభియోగంతో రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు, సుఖేష్ గుప్తా కు చెందిన సంస్థలలో పెద్ద ఎత్తున బంగారం, బంగారు ఆభరణాలు, వజ్రాలు స్వాధీనం చేసుకుంది. మొత్తం ఆరు కేసులలో సుఖేష్ గుప్తా మోస్ట్ వాంటెడ్ గా ఉండడంతో ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఎంబీఎస్ జ్యూవెలర్స్ ఎండి సురేష్ గుప్తా అరెస్ట్ హాట్ టాపిక్ గా మారింది.

సుఖేష్ గుప్తా చేసిన అక్రమాలు ఇవే
గత మూడు సంవత్సరాలుగా ఎంబీఎస్ జ్యూవెలర్స్ ఎండి సుఖేష్ గుప్తా అనేక చిరునామాలతో తప్పించుకుని తిరుగుతున్నాడు. విదేశాల నుండి అక్రమ మార్గంలో బంగారం స్మగ్లింగ్, గోల్డ్ ఎక్స్ పోర్ట్ బ్యాంకుల నుండి రుణాలు ఎగవేత, పెద్ద నోట్ల రద్దు సమయంలో ఫేక్ ఇన్వాయిస్ లు సృష్టించి బంగారాన్ని అమ్మినట్టు మోసం చేయడం వంటి అనేక ఆరోపణలు సుఖేష్ గుప్తా పై ఉన్నాయి. అంతేకాదు ఎంఎంటీసీ నుండి పొందిన గోల్డ్ క్రెడిట్ కు ఎటువంటి పన్ను కట్టలేదు ఎంబీఎస్ జ్యూవెలర్స్. దీంతో మొత్తం సుఖేష్ గుప్తాపై మూడు నేరాల కింద కేసు నమోదు చేసింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.

వంద కోట్లకు పైగా బంగారం, 50 కోట్లకు పైగా పత్రాలు స్వాధీనం
బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని సుఖేష్ గుప్తా ఇతర పనుల కోసం వాడుకున్నారని ఈడీ అధికారులు గుర్తించారు.తెలుగు రాష్ట్రాల్లో భారీగా భూములను కొనుగోలు చేశారు. ఇక తాజా సోదాలలో వంద కోట్లకు పైగా విలువైన బంగారాన్ని సీజ్ చేశారు. 50 కోట్ల రూపాయలు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఈడి తనిఖీలలో భాగంగా అక్రమాలు జరిగాయని గుర్తించి సుఖేష్ గుప్తాను ఈడీ అదుపులోకి తీసుకుంది. అరెస్టు అనంతరం సుఖేష్ గుప్తాను సిసిఎస్ కు తరలించింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. ఈ కేసులో దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications