టీఆర్ఎస్ Vs టీఆర్ఎస్ . కేసీఆర్ చెప్పిన కొత్త కథ !

నా నియోజకవర్గం ఉన్న పార్లమెంట్ కు దేశవ్యాప్తంగా రికార్డ్ సృష్టించాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్, మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో ఆయన పాల్గోన్నారు. ఇందులో భాగంగానే సీఎం మెదక్ లో టీఆర్ఎస్ కు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పోటీలేదన్నారు. అయితే టీఆర్ఎస్ కు టీఆర్ఎస్ తోనే పోటీ ఉందని తెలిపారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ స్థానాలు మెజారీటి ఇచ్చేందుకు పోటి పడుతున్నారని తెలిపారు.

మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి దేశంలోనే రికార్డ్ సాధించేలా తీర్పును ఇవ్వాలని ఆయన కోరారు. కాగా రాహుల్ గాంధి నాయనమ్మ ఇందిరా గాంధి నుండి రాహుల్ గాంధి వరకు గరీభీ హఠావో అనే ఒకే నినాదాన్ని ఇస్తున్నారని విమర్శించారు.

medak parlament constituency should create record : cm Kcr

కాగా గత ఎన్నికల్లో బీజేపీ 118 స్థానాల్లో పోటీ చేస్తే,103 స్థానాల్లో కనీసం డిపాజిట్ కూడ రాలేదని విమర్శించారు.అలాంటీ పార్టీ ఇప్పుడు బోబ్బపెడుతుందని అన్నారు. కాగా ప్రధాని మోదీ ప్రతి ఇంటికి పది హేను లక్షల రుపాయలు ఇస్తానని ప్రకటించిన హమీ ఏమైందని ప్రశ్నించారు.ఈసంధర్భంగా బీజేపీ,కాంగ్రెస్ పార్టీలపై ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లు పరిపాలించిన రెండు పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటూ, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు.రెండు పార్టీలు ప్రజలకు కనీస మౌలిక సదుపాయలు కల్పించలేదని దుయ్యబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+