మేడారంలో సమ్మక్క సారలమ్మలకు బంగారం నైవేద్యం ఎందుకు సమర్పిస్తారంటే

గిరిజన కుంభమేళాగా గుర్తించబడిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో జాతరకు వచ్చే భక్తులు అమ్మవార్లకు నైవేద్యంగా బంగారాన్ని సమర్పిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి గిరిజనుల భాషలో బంగారం అంటే బెల్లం. సమ్మక్క సారలమ్మలను పూజించే భక్తులు, తమ కోరికలు తీర్చే తల్లికి నిలువెత్తు బంగారాన్ని నైవేద్యంగా పెడతామని చెబుతారు. కోరికలు తీరితే అదేవిధంగా నిలువెత్తు బంగారాన్ని నైవేద్యంగా నివేదిస్తారు.

బంగారాన్ని నివేదించటం వెనుక కారణాలు ఇవే
అసలు ఎందుకు బంగారాన్ని నైవేద్యంగా పెడతారు అనేది సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన ఒక విశేషం. గతంలో మేడారం రాజ్యంలో కాకతీయ రాజులకు కప్పంగా బంగారాన్ని చెల్లించేవారు. ఇక అటువంటి బంగారాన్ని(బెల్లం) తమకోసం కాకతీయ రాజులతో పోరాటం చేసిన సమ్మక్క సారలమ్మలకు కృతజ్ఞతగా గిరిజన కోయలు సమర్పించడం ఆనవాయితీగా వచ్చిందని చెబుతున్నారు.

medaram jathara this is the interesting facts about medaram bangaram as prasadam for sammakka saralamma

ఎప్పటికీ నాశనం కాని పదార్థం
బంగారం అంటే బెల్లం పాడుకానిది. ఎప్పటికీ నాశనం కాని పదార్థం. సమ్మక్క సారలమ్మలు చరిత్ర నిలిచిన అంతకాలం నిలిచే ఉంటారు. అలా నిలిచిఉండే తల్లులకు ఎప్పటికీ నాశనం కాని బంగారాన్ని సమర్పించాలి అనేది వారి ఉద్దేశం. అంతేకాదు బెల్లం చెరకు నుండి తయారు చేస్తారు. ప్రకృతి ప్రసాదించిన చెరకు నుండి వచ్చేది బెల్లం కాబట్టి ఆ బెల్లాన్ని అమ్మకు నైవేద్యంగా పెడితే తల్లి సంతోషించి కరుణిస్తుందని గిరిజన కోయలు విశ్వసిస్తున్నారు.

అడవి బిడ్డలు బెల్లాన్ని నైవేద్యంగా నివేదించడం గౌరవానికి సూచన
అందుకే అమ్మవారికి బంగారాన్ని నైవేద్యంగా పెడుతున్నారు. ఇవి మాత్రమే కాదు బంగారం తీపికి సంకేతం. జీవితంలో ఉన్న చెడు పోయి, బ్రతుకంతా తియ్యగా ఉండాలని భావించి కూడా బంగారాన్ని నివేదిస్తారు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది మాత్రమే కాదు అడవి బిడ్డలు బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదించడం వారి గౌరవానికి సూచనగా భావిస్తారు.

మేడారం జాతరలో బంగారాన్ని నివేదించడం ఆనవాయితీ
అడవి దేవతలకు రాజస నైవేద్యంగా భావిస్తారు. అందుకే మేడారం జాతరలో బంగారాన్ని నివేదించడం ఆనవాయితీగా వస్తుంది. ఇది అనాదిగా కొనసాగుతున్న ఆచారం. అయితే దీని వెనుక ఇంత అర్థం, ప్రకృతితో ముడిపడి ఉన్న జీవనం, తాత్విక రహస్యం ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+