ఎంసెట్ లీకేజ్‌పై సిఐడి: అనుమానిత విద్యార్థుల పేరెంట్స్ కాల్ డేటా పరిశీలన

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఎంంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై సిఐడి తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వ హించిన ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకైందని, ర్యాంకులలో అనేక అక్రమాలు చోటు చేసుకు న్నాయని వస్తున్న ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరపాలని సిఐడిని రాష్ట్ర డిజిపి అను రాగ్‌శర్మ బుధవారం ఆదేశించారు.

బుధవారం మెడికల్ టాపర్స్‌ను సిఐడి అధికారులు ప్రశ్నించారు. కనీసం ఐదుగురు విద్యార్థులను సిఐడి అధికారులు విచారించారు. గురువారంనాడు అనుమానిత విద్యార్థుల తల్లిదండ్రుల కాల్‌డేటాను పరిశీలించారు. కాగా, ఎంసెట్ -2 కన్వీనర్ రమణారావు గురువారంనాడు సిఐడి ముందుకు వచ్చి అన్ని వివరాలను అందించారు. ప్రశ్నపత్రం తయారీ నుంచి పరీక్షాకేంద్రాలకు వాటిని తరలించే వరకు తాము తీసుకున్న జాగ్రత్తల గురించి ఆన వివరించారు.

సిఐడి అధికారులు కొంత మందిని తమ కార్యాలయానికి పిలిపించి వివరాలు సేకరిస్తున్నారు. ఎంసెట్-2 ప్ర వేశపరీక్ష కన్నా ముందు గానే ప్రశ్నాపత్రం బయట కు వచ్చిందని, కొందరు విద్యార్థులు అక్రమ మా ర్గాల ద్వారా ర్యాంకులను పొందారని గత రెండ్రోజులుగా మీడియాలో కథనాలు వస్తు న్నాయి. దీంతో విద్యార్థి సంఘాలు కూడా ఆందో ళనకు దిగాయి.

Medical entrance toppers quizzed by CID

ప్రశ్నాపత్రం లీకెజి, అక్రమా లపై విచారణ జరిపించాలని, దోషులను గుర్తించి శిక్షించాలంటూ కూకట్‌పల్లిలోని జెఎన్‌టియు ముందు మంగళవారం ఎబివిపి విద్యార్థి సంఘం ధర్నా నిర్వహించగా, బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ, టిఎన్‌ఎస్‌ఎఫ్ తదితర విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్ కన్వీనర్ రమ ణారావు బుధవారం డిజిపి అనురాగ్ శర్మను కలిసి మీడియా కథనాలు, విద్యార్థి సంఘాల ఆందోళనలపై వాస్తవాలను వెలికి తీయాలని కోరారు.

ఈ మేరకు ఒక ఫిర్యాదును కూడా డిజిపికి అందించారు. దీంతో ఈ మొత్తం వ్యవ హారంపై వాస్తవాలను వెలికి తీసి నిజానిజాలను నిగ్గు తేల్చాలంటూ డిజిపి అనురాగ్‌శర్మ సిఐడిని ఆదేశించారు. ఇదిలా ఉండగా, ఈ మొత్తం వ్యవహారంపై జెఎన్‌టియు కూడా అంతర్గత విచారణ జరుపుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At least five medical entrance test rank holders were grilled by the Crime Investigation Department (CID) in connection with the Eamcet-2 question paper leak case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి