కొండా సురేఖకు కాంగ్రెస్ కమాండ్ భారీ షాక్..!!
మంత్రి కొండా సురేఖ వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఓఎస్డీ సుమంత్ వివాదం.. అరెస్ట్ కోసం పోలీసులు వెళ్లిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ విషయం హైకమాండ్ కు చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనకు కొండా సురేఖ మంత్రిగా ఉంటూ దూరంగా ఉండటం పైన చర్చ మొదలైంది. ఇప్పుడు నేరుగా హైకమాండ్ నుంచి సురేఖకు సూచనలు అందాయి. ఈ వివాదం పైన ఇప్పుడు హైకమాండ్ నిర్ణయం ఉత్కంఠ పెంచుతోంది.
మంత్రి కొండా సురేఖ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఓఎస్డీ సుమంత్ వివాదంలో కొండా సురేఖ..కుటుంబ సభ్యుల వ్యవహార శైలి పైన విమర్శలు మొదలయ్యాయి. తాజాగా మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద రాత్రి హైడ్రామా నెలకొంది. సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సుమంత్‌పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకునేందుకు వచ్చామన్నారు. మఫ్టీలో ఉండడంతో గుర్తుతెలియని వ్యక్తులుగా భావించిన సురేఖ కుమార్తె సుస్మిత కిందకు వచ్చి వారిని ప్రశ్నించారు. వారిని ఇంట్లోకి అనుమతించబోమంటూ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి మంత్రి కొండా సురేఖ, ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ ఇద్దరూ ఒకే కారులో వెళ్లిపోయారు.

ఇదే సమయంలో సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలంగా మారాయి. బీసీ కార్డు తెర మీదకు తెచ్చారు. దీంతో.. ఇప్పుడు సురేఖ వ్యవహారం పైన పార్టీ నాయకత్వం ఆరా తీసింది. నేరుగా కొండా సురేఖతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. సుస్మితా మాట్లాడిన మాటల పైన ఆగ్రహం వ్యక్తం చేసారని పార్టీ నేతుల చెబుతున్నారు. ఇదే సమయంలో సురేఖను ఈ వివాదం పైన మీడియాతో మాట్లాడవద్దని.. ఓపెన్ కామెంట్స్ చేయవద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పెద్దల పైనా సుస్మిత సీరియస్ కామెంట్స్ చేసారు. కాగా.. సురేఖ మంత్రిగా ఉంటూ ఇలా వరుస వివాదాల్లో చిక్కుకోవటం పైనా ఆరా తీసినట్లు తెలుస్తోంది. సురేఖ విషయంలో హైకమాండ్ ఆగ్రహంగా ఉండటం తో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications