ఈ మెడిసిన్స్ వాడితే అంతే..: చాక్ పౌడర్, గంజితో మందుల తయారీ
హైదరాబాద్: నకిలీ మందులు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠా గుట్టు రట్టుచేశారు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు. మెగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో మార్కెట్లోకి వస్తున్న మెడిసిన్స్ నకిలీవని తేల్చారు. ఆ ట్యాబ్లెట్లలో అసలు మెడిసినే లేదని స్పష్టం చేశారు. చాక్ పౌడర్, గంజితో తయారు చేస్తున్న ఆ మెడిసిన్స్‌ను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సీజ్ చేసింది.
దాదాపు రూ. 33 లక్షల విలువైన మెడిసన్ సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మెగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో వచ్చే మెడిసిన్స్ వాడకం ఆపేయాలని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. ఈ టాబ్లెట్ల వాడకం ఆరోగ్యానికి హానికరమని అధికారులు తెలిపారు. రిటెయిలర్స్ కూడా ఈ కంపెనీ మెడిసిన్ ని పంపిణీ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.

కల్తీ మందులు తయారు చేస్తున్నవారిపై డీసీఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ మందులు వాడితే హై రిస్క్ ఉంటుందని, మార్కెట్లో మెగ్ లైఫ్ సైన్సెస్ పేరిట విక్రయించే మందులను కొనొద్దన్నారు. ఎవరైనా ఎప్పటికే కొనుగోలు చేస్తే వాటిని వాడొద్దని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు హెచ్చరించారు.
మరోవైపు, నల్గొండ జిల్లాలోనూ డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇర్కిగూడెం గ్రామం దామెరచర్ల మండలంలో ఓ మెడికల్ షాపులో తనిఖీ చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా ఆర్ఎంపిగా దాసరి మల్లయ్య మెడికల్ షాపు నిర్వహిస్తూ.. క్లినిక్ పేరుతో వైద్యం చేస్తున్నట్లుగా గుర్తించారు. తనిఖీలు చేసిన క్రమంలో 41రకాలైన 45 వేల రూపాయల విలువ గల మెడిసిన్స్ సీజ్ చేశారు.
పట్టుబడ్డ మెడిసిన్‌లు అన్ని కూడా యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, అనాల్జెసిక్స్, దగ్గు సిరప్‌లు, యాంటీ అల్సర్, యాంటీ డయాబెటిక్స్, యాంటీహైపెర్టెన్సివ్స్ మందులుగా గుర్తించారు. అనుమతి లేకుండా డ్రగ్స్ నిర్వహణ, డ్రగ్స్ అమ్మకాలు చేసినా నేరమని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆర్ఎంపిలను హెచ్చరిస్తున్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications