మెల్‌ బోర్న్‌ లో విషాదం.. రెండేళ్ల కుమారుడితో స‌హా హైదరాబాదీ మహిళ మృతి..

హైదరాబాద్‌ లోని మలక్‌ పేటకు చెందిన రబియా బేగం(32), ఆమె రెండేళ్ల కుమారుడు అబ్దుల్లా అబ్బాస్ ఆస్ట్రేలియాలోని మెల్‌ బోర్న్‌ లో మంగ‌ళ‌వారం ఓ కాలువలో మునిగి మృతి చెందారు. మెల్ బోర్న్ లోని మాల్కమ్ క్రీక్ వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో మలక్ పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన నవంబర్ 17 న జరిగినట్లు సమాచారం.

రబియా బేగం ఫ్యామిలీ గోల్డెన్ సన్ మాత్ పార్క్ సమీపంలో వాకింగ్‌ కు వెళ్లిన సమయంలో బాలుడు ప్రమాదవశాత్తు కాలువలోకి దిగినట్లు సమాచారం. అయితే కుమారుడిని కాపాడేందుకు తల్లి కూడా నీటిలోకి దిగింది. ఈ క్రమంలో తల్లీకొడుకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అత్యవసర సేవల సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో భర్తతోపాటు వారి మూడేళ్ల కుమార్తె కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక ఈ ఘటనతో మలక్ పేట్ లోని రబియా బేగం ఇంట్లో విషాదం నెలకొంది.

Melbourne Deep tragedy news latest Woman from Hyderabad and her two-year-old son drown in a canal

ఈ ఘటనపై మజ్లిస్ బచావో తెహ్రీక్ అధికార ప్రతినిధి అంజేద్ ఉల్లా ఖాన్ స్పందించారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ఈ ఘటనపై వెంటనే స్పందించి హైదరాబాద్ లోని మృతుల కుటుంబాన్ని వీలైనంత త్వరగా మెల్ బోర్న్ పంపించే ఏర్పాట్లు చేయాలని కోరారు. వారికి వీసాలను వెంటనే జారీ చేయాలని అన్నారు. దాంతో ఆ కుటుంబం మెల్ బోర్న్ చేరుకుని వారి అంత్య క్రియలను పూర్తి చేస్తుందని తెలిపారు. కష్టకాలంలో మెల్ బోర్న్ లోని ఆ కుటుంబానికి అండగా ఉండాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+