నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాక్ డౌన్‌ ఎఫెక్ట్.. భర్త శవంతో 3 రోజులు ఇంట్లోనే... నిజామాబాద్‌లో విషాదం..

|
Google Oneindia TeluguNews

ఆమె.. మానసిక స్థితి సరిగా లేని వృద్దురాలు. అతను... అనారోగ్యంతో బాధపడుతున్న వృద్దుడు.పిల్లలు వేరే చోట స్థిరపడటంతో ఈ వృద్ద జంట మాత్రమే ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అతని అనారోగ్యం గురించి పట్టించుకోలేదు. దీంతో అతను ఇంట్లోనే మృతి చెందాడు. విషాదమేంటంటే.. అతను చనిపోయి 3 రోజులు కావస్తున్నా.. ఆ వృద్దురాలు ఆ విషయమే గుర్తించలేకపోయింది. లాక్ డౌన్ కారణంగా ఎవరిళ్లకు వారే పరిమితమవడంతో ఆ వృద్ద దంపతుల గురించి ఎవరూ పట్టించుకోక పోవడం వల్లే ఇలా జరిగినట్టు తెలుస్తోంది.నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 కరోనా వేళ ఆ ఉద్యోగాలకు ఢోకాలేదు, లాక్ డౌన్ తర్వాత మరిన్నికొలువులు.. కరోనా వేళ ఆ ఉద్యోగాలకు ఢోకాలేదు, లాక్ డౌన్ తర్వాత మరిన్నికొలువులు..

ఆమె మానసిక స్థితి సరిగా లేదు..

ఆమె మానసిక స్థితి సరిగా లేదు..

పోలీసుల కథనం ప్రకారం.. నోముల లింబారెడ్డి(70) వీఆర్వోగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు భార్య శకుంతల(65),ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు హైదరాబాద్‌లో,కుమార్తె ఇంగ్లాండులో స్థిరపడ్డారు. రిటైర్‌మెంట్ తర్వాత లింబారెడ్డి తన భార్యతో కలిసి నిజామాబాద్‌లోని కంఠేశ్వర్ న్యూహౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా శకుంతల మానసిక స్థితి సరిగా లేదు.

కరోనా లాక్ డౌన్‌తో..

కరోనా లాక్ డౌన్‌తో..

కరోనా లాక్ డౌన్ కారణంగా అంతా ఎవరిళ్లకు వారే పరిమితమవడంతో ఈ వృద్ద జంట బాగోగులు ఎవరూ పట్టించుకోలేదు. బుధవారం(మే 13) ఉదయం ఇంట్లో పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తి.. లోపలి నుంచి దుర్వాసన రావడం గుర్తించాడు. దీనిపై శకుంతలను ఆరా తీయగా.. ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. పొరుగింటి వాళ్లకు చెప్పడంతో.. వారు కూడా అడిగి చూశారు. అయినప్పటికీ ఆ వృద్దురాలు ఏమీ చెప్పలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Recommended Video

Water Dispute between AP & TS | Telugu States CM's Clash Over Pothireddypadu Capacity
3 రోజుల క్రితమే మృతి..

3 రోజుల క్రితమే మృతి..

పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా.. లింబారెడ్డి తన మంచం పైనే మృతి చెందినట్టు గుర్తించారు. మూడు రోజుల క్రితమే అతను చనిపోయినట్టు భావిస్తున్నారు. వెంటనే లింబారెడ్డి కొడుకుకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించారు. పోస్టుమార్టమ్ నివేదికలో సాధారణ మరణంగానే తేలింది. లింబారెడ్డి కుమారుడు కూడా.. తమకు ఎవరిపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశాడు. తన తల్లి మానసిక స్థితి సరిగా లేకపోవడంతోనే.. తండ్రి చనిపోయిన విషయాన్ని గుర్తించలేదన్నాడు. అయితే లాక్ డౌన్ వేళ... ఆ కొడుకు కనీసం రోజుకు ఒకసారైనా ఫోన్ చేసి తల్లిదండ్రుల యోగ క్షేమాలు పట్టించుకోవాల్సింది కదా అని స్థానికులు వాపోతున్నారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

English summary
A mentally-unstable woman spent three days with her husband’s decomposed body in their house at New Housing Board Colony in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X