నిషిత్ మరణానికి కారణాలేమిటి? 2 రోజుల్లో నివేదిక

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ కొడుకు నిషిత్ మరణానికి సంబంధించి బెంజ్ కంపెనీకి చెందిన ప్రతినిధులు రెండురోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే వారు సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

వారం రోజుల క్రితం హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ తనయుడు నిషిత్ అతని స్నేహితుడు రాజా రవివచంద్ర మరణించారు.అయితే ఈ ఘటనకు సంబందించి పోలీసులు విచారణ చేస్తున్నారు.

అయితే అత్యాధునిక సదుపాయాలున్నప్పటీ ఈ కారులో ప్రయాణీస్తున్న ఇద్దరు మరణించారు.అయితే ఎంత ఘోరమైన ప్రమాదం జరిగిన కారులో ప్రయాణిస్తున్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షణ చర్యలను కారు తయారు చేసిన మెర్సిడెజ్ బెంజ్ తీసుకొంది.అయినా ఈ కారులో ప్రయాణిస్తున్న నిషిత్, రాజారవిచంద్రలు ప్రమాదానికి గురై మరణించారు.

ఈ కారు ప్రమాదానికి సంబందించిన విచారణ చేస్తున్న పోలీసులు కూడ ఈ విషయమై మెర్జిడెజ్ కంపెనీ ప్రతినిధులకు తమ సందేహాలను నివృత్తి చేయాలని లేఖ రాశారు. అయితే అన్ని సౌకర్యాలున్నప్పటికీ కూడ ఈ కారు ఎందుకు ప్రమాదానికి గురైందనే విషయమై తయారీదారులు విచారణ నిర్వహిస్తున్నారు.ఈ మేరకు జర్మనీ నుండి కంపెనీకి చెందిన ప్రతినిధుల బృందం కారు ప్రమాదంపై విచారణ చేస్తోంది.

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వనున్న జర్మనీ బెంజ్ ప్రతినిధులు

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వనున్న జర్మనీ బెంజ్ ప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ అతడి స్నేహితుడు మరణించారు. ప్రమాదానికి గురై చనిపోయారు. అయితే జర్మనీ బెంజ్ ప్రతినిధులు రెండు రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు. అన్ని సౌకర్యాలున్నా ఈ కారులో ఎలా ఈ ప్రమాదం జరిగిందనే విషయమై కారు తయారీదారులు కూడ ఆరాతీస్తున్నారు. ఈ నివేదక ఆధారంగా ఈ ప్రమాదంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పోలీసులు సంధించిన ప్రశ్నలివే

పోలీసులు సంధించిన ప్రశ్నలివే

అత్యాధునిక సౌకర్యాలున్న విలువైన కారులో ప్రయాణించిన వారు చనిపోవడానికి గల సరైన కారణాలు ఏమై ఉంటాయనే విషయాన్ని తెలుసుకొనేందుకుగాను జూబ్లిహిల్స్ పోలీసులు మెర్సిడెజ్ బెంజ్ కార్ల కంపెనీ యాజమాన్యానికి 6 ప్రశ్నలను సంధించారు. ప్రమాదంలో ఎయిర్ బెలూన్లు ఏ పరిస్థితుల్లో తెరుచుకొంటాయి?నిషిత్ ప్రమాదానికి గురైన సమయంలో బెలూన్లు ఎందుకు పగిలిపోయాయి, మెకానికల్ డిఫెక్ట్స్ ఉన్నాయా, స్పీడో మీటర్ ఎంతవరకు లాక్ చేయాలి, ఎంత స్పీడ్ ఉంటే ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకొంటాయి, సీటు బెల్ట్ పెట్టుకొంటేనే తెరుచుకొంటాయి , పెట్టుకోకున్నా తెరుచుకొంటాయా అన్న విషయాలు తెలపాల్సిందిగా పోలీసులు మెర్సిడెజ్ బెంజ్ కంపెనీకి లేఖ రాశారు.

కారు పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్న బెంజ్ కంపెనీ ప్రతినిధులు

కారు పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్న బెంజ్ కంపెనీ ప్రతినిధులు

నిషిత్ , రాజా రవిచంద్ర మరణానికి కారణమైన మెర్సిడెజ్ బెంజ్ కంపెనీ కారును జర్మనీ నుండి వచ్చిన ప్రతినిధులు పరిశీలించారు. బోయిన్ పల్లిలోని బెంజ్ షోరూంలో ఉన్న కారును పరిశీలించారు జర్మనీ ప్రతినిధులు. అసలు డ్రైవింగ్ చేసేటప్పుడు సీటు బెల్టు పెట్టుకొన్నారా, అనే విషయాన్ని కూడ పరిశీలిస్తున్నారు. కారు వేగం, సీటు బెల్టు, బెలూన్లు, ఆ సమయంలో ఇంజన్ పరిస్థితి తదితర అంశాలపై ప్రధానంగా బెంజ్ కంపెనీ ప్రతినిధులు నివేదికను ఇవ్వనున్నారు.

అత్యాధునిక సౌకర్యాలున్నా ప్రమాదమెలా జరిగింది?

అత్యాధునిక సౌకర్యాలున్నా ప్రమాదమెలా జరిగింది?

అత్యాధునిక సౌకర్యాలున్నప్పటికీ ఈ కారు ప్రమాదానికి గురైన సమయంలో ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.అయితే దానికి విరుద్దంగా ఈ ప్రమాదసమయంలో నిషిత్ తో పాటు రాజారవిచంద్రలు మరణించారు.అయితే ఈ ప్రమాదం వల్ల ఇద్దరు మరణించడం కూడ ఈ కారు తయారీదారులకు ఇబ్బందిగా మారింది.దీంతో ఈ విషయంలో అసలేం జరిగిందనే దానిపై కంపెనీ ప్రతినిధులు ఆరాతీస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mercedes benz company delegates will submit report wihtin two days on Nishit car accident.they were inspect accident spot.
Please Wait while comments are loading...