అలాంటి బీఆర్ఎస్‌నే బీజేపీలో విలీనమా?: కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. గులాబీ పార్టీ గంగలో కలిసిన పార్టీ అని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసుకున్నా, ఏం ఉపయోగం లేదని తెలిపారు. అవినీతి, కుటుంబ పార్టీలకు బీజేపీ దూరంగా ఉంటుందన్నారు.
కేసీఆర్, కేటీఆర్‌ను ప్రజలు చీదరించుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే మొదలైందని, బీఆర్‌ఎస్ త్వరలోనే కాంగ్రెస్‌లో విలీనం కాబోతుందన్నారు. అందుకే కొంతమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని చెప్పుకొచ్చారు. వారి విలీనంపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకే.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీకి ఎవరి మద్దతు అవసరం లేదని, ప్రజల మద్దతు ఉంటే చాలని బండి సంజయ్ తెలిపారు. 6 గ్యారెంటీలను పక్కదోవ పట్టించడానికే విలీన ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. రుణమాఫీపై రైతులు ఆందోళనలో ఉన్నారని, రైతులకు బ్యాంకుల నుంచి ఎన్‌వోసీలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీజేపీ పోరాడుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇది ఇలావండగా, హైదరాబాద్ నగరంలోని సుల్తాన్ బజార్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ది యంగ్ మెన్స్ ఇంప్రూ్మెంట్ సొసైటీ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ తో కలిసి బండి సంజయ్ ప్రారంభించారు. 150 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ సంస్థ.. అనేక మంది మహనీయుల మార్గర్శకంలో కొనసాగడం అభినందనీయమన్నారు బండి సంజయ్. శ్యామ్ జీ నేతృత్వంలో ఈ భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. లక్ష్యం లేకుండా ఏ సంస్థ ముందకు సాగదని, ఈ సంస్థకు ఒక లక్ష్యం ఉందన్నారు.












Click it and Unblock the Notifications