• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మెట్ గాలాలో మెరిసారు-ఓన్లీ ఇండియన్ గా నిలిచారు : సుధారెడ్డి "మెగా " స్పెషల్..ఆమె ఎవరో తెలుసా..!!

By Chaitanya
|

తెలుగు మహిళ చరిత్ర క్రియేట్ చేసారు. ఈ మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై ప్ర‌పంచం న‌లుమూలల నుంచీ సెల‌బ్రిటీలు హొయ‌లు పోతూ ఫొటోల‌కు పోజులిస్తారు. అలాంటి ఈవెంట్‌లో ఈసారి ఇండియా నుంచి ఒకే ఒక్క వ్య‌క్తి పాల్గొన్నారు. ఆమె పేరు సుధా రెడ్డి. అయితే ఆమె సెల‌బ్రిటీయో, సినిమా స్టారో కాదు. వ్యాపార రంగంలోనే కాదు..ఫ్యాషన్ నైట్ లో ప్రతిష్ఠాత్మక మెట్ గాలా ఉత్తమ దుస్తులు ధరించిన మహిళగా రికార్డు సాధించారు.

నిర్మాణ రంగంలో దేశంలోనే పేరు సాధించిన మేఘా ఇంజనీరింగ్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ సుధ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందిరి దృష్టిని ఆకర్షించారు. బిలియనీర్ బిజినెస్ మెన్ మెగా క్రిష్ణా రెడ్డి సతీమణి సుధ. ప్రతీ ఏటా మే లో మెట్ గాలా ఉత్తమ దుస్తులు ధరించి..ఫ్యాషన్ నైట్ నిర్వహిస్తారు

MET Gala 2021లో మన హైదరాబాదీ సుధారెడ్డి..ఎవరు ఈమె (ఫోటోలు)MET Gala 2021లో మన హైదరాబాదీ సుధారెడ్డి..ఎవరు ఈమె (ఫోటోలు)

మెగా సుధ..రెడ్ కార్పెట్ ఆరంగేట్రం

మెగా సుధ..రెడ్ కార్పెట్ ఆరంగేట్రం

ఈ సారి కరోనా కారణంగా సెప్టెంబర్ లో ఏర్పాటు చేసారు. ప్రముఖ డిజైనర్లు..ఫల్గుణి , షేన్ పీకాక్ డిజైన్ చేసిన హాట్ కోచర్ గౌనులో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాషన్ నైట్ మెట్ గాలా కోసం రెడ్ కార్పెట్ ఆరంగేట్రం చేసారు. తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో తనను తాను కళ..ఫ్యాషన్‌కి ఆసక్తిగల వ్యక్తిగా అభిర్ణించుకున్నారు. దాతృత్వంలో సుధారెడ్డి మంచి పేరు సంపాదించారు. గతంలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే తో పాటుగా ఇషా అంబానీ వంటి ప్రముఖులు ఈ షోకు హాజరయ్యారు. ఈ సంవత్సరం మాత్రం భారత్ నుంచి హాజరైన ఏకైక వ్యక్తిగా సుధ ఖ్యాతి గడించారు.

సినీ ప్రముఖులను మించిపోయేలా అకర్షిస్తూ

సినీ ప్రముఖులను మించిపోయేలా అకర్షిస్తూ

సినిమా పరిశ్రమ కాకుండా ఇతర రంగాల నుంచి వచ్చిన తొలి మహిళ గా సుధ కొత్త రికార్డు క్రియేట్ చేసారు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు తారలు ఈ కార్పెట్ ను అలంకరించిన చరిత్ర ఉంది. ఇక, ఈ షో లో సుధ తన కార్పెట్ లుక్ కోసం.. బ్రహ్మండమైన నంబర్ లో మెరిసింది. డిజైనర్లు చెబుతున్న దాని ప్రకారం సుధ ధరించిన గౌను తయారు చేయటానికి 250 గంటల సమయం తీసుకుంది. సుధ పరిశీలనాత్మకత ..వ్యక్తిత్తవానికి పూర్తి న్యాయం చేసే విధంగా ఈ డిజైన్ కనిపిస్తోంది.

250 గంటలు తీసుకున్న గౌను తయారీ

250 గంటలు తీసుకున్న గౌను తయారీ

తాము మెట్ గాలా థీమ్ ప్రతిబింబించేలా కొత్త సైనిక.. ప్రేరేపిత రూపాన్ని క్రియేట్ చేసినట్లుగా డిజైనర్లు ఇద్దరూ స్పష్టం చేసారు. బాడీ-హగ్గింగ్ గౌనులో సీక్విన్స్‌లో ఎంబ్రాయిడరీ చేసిన అమెరికన్ జాతీయ జెండా రంగులతో పాటుగా..బంగారం, ఎరుపు మరియు నేవీ-బ్లూ కలర్ స్వరోవ్‌స్కీ స్ఫటికాలు, పూసలు మరియు సీక్విన్‌లతో అట్రాక్టివ్ గా దీనిని తయారు చేసారు. ఈ ఈవెంట్ కోసం సుధా చాలా పక్కాగా వ్యవహరించారు. ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆభరణాల డిజైనర్ ఫరా ఖాన్ డ్రీమి డికాడెన్స్ అనే కస్టమ్ మేడ్ పీస్‌ని ఎంచుకున్నారు.

35 క్యారెట్ల వివిఎస్ వజ్రాలతో రూపొందించి..

35 క్యారెట్ల వివిఎస్ వజ్రాలతో రూపొందించి..

అమెరికాలోని 50 అద్భుతమైన స్వతంత్ర రాష్ట్రాలకు ప్రతీక అయిన అమెరికన్ జెండాలలోని నక్షత్రాల నుండి ప్రేరణ పొంది..డైమండ్ పొదిగిన నక్షత్రాలతో ఒక ఇంద్రియ చెవి కఫ్‌ను డిజైనర్లు రూపొందించారు. ఇది 18 కేటి బంగారంతో 35 క్యారెట్ల వివిఎస్ వజ్రాలతో రూపొందించటం దీని ప్రత్యేకత. ఇక, తెలుగు రాష్ట్రాల్లో మెగా సంస్థల గురించి తెలయని వారెవరూ ఉండరు. ప్రస్తుతం తెలంగాణలోని అనేక సాగునీటి ప్రాజెక్టులతో పాటుగా ఏపీలోని ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు సైతం మెగా నిర్మిస్తోంది.

అంతర్జాతీయ స్థాయిలో కీర్తి..

అంతర్జాతీయ స్థాయిలో కీర్తి..

ఇక, జాతీయ స్థాయిలో మెగా గ్రూపుకు మంచి ఇమేజ్ ఉంది. ఈ సంస్థలో డైరెక్టర్ గా వ్యాపార నిర్వహణ తో పాటుగా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాషన్ రంగంలో దేశం తరపున రెడ్ కార్పెట్ ఎంట్రీ ఇచ్చి..తెలుగు మహిళగా తన శక్తిని చాటారు. ఇప్పుడు ఈ అంశాన్ని జాతీయ-అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురిస్తోంది. దీంతో..అంతర్జాతీయ స్థాయిలో సుధ గురించి ఆసక్తి కర చర్చ సాగుతోంది.

English summary
Hyderabad based industrialist MEGHA Krishna Reddy wife Sudhareddy had made her presence at MET Gala 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X