Rains: ఆగస్ట్ 3 వరకు వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..

హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (IMD) నగరంలో మంగళవారం వర్షం పడే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్ తో పాటు మొత్తం ఆరు జోన్లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు ఆ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ఆగస్టు 3, 2023 వరకు హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

rains6

నిన్న తెలంగాణలో కామారెడ్డిలో అత్యధికంగా 74.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజధాని నగరంలో అత్యధికంగా తిరుమలగిరిలో 57.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పటికే తీవ్ర అల్పపీడనంగా మారిందని ఐఎండీ తెలిపింది. దీని కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది.

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం బంగ్లాదేశ్ తీరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందని వివరించింది. ఆగస్టు 3 నుంచి 6వ తేదీ వరకు వాయువ్య భరతంలో వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

మహారాష్ట్ర, కొంకణ్ తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, జార్ఘండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి 5 రోజులు భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం ఈ ప్రాంతాల్లో సాధారణంగానే ఉంటుందని, ఆ తరువాత 94 నుంచి 106 శాతం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+