హైదరాబాదులో మెట్రో క్రేన్ కింద నలిగిపోయిన వ్యక్తి

హైదరాబాద్: గూడు లేని నిరుపేద మంగళవారంనాడు మెట్రో క్రేన్ కింద నలిగి చనిపోయాడు. అతనికి దాదాపు 50 ఏళ్ల వయస్సు ఉంటుంది. ఈ ప్రమాదం హైదరాబాదులోని గాంధీభవన్ ఎదురుగా మొజంజాహీ మార్కెట్ వద్ద జరిగింది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న అతనిపై నుంచి క్రేన్ వెళ్లింది.

క్రేన్ మొజంజాహీ మార్కెట్‌లోని మెట్రో రైలు నిర్మాణ స్థలానికి వెళ్తుండగా ధ్వంసమైన ఫుట్‌పాత్ పైకి ఎక్కిందని, ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి వెళ్లిందని పోలీసులు చెప్పారు. క్రేన్ భారీగా ఉండడంతో డ్రైవర్‌కు ఫుట్‌పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి కనిపించలేదని అంటున్నారు.

Metro crane crushes man at MJ Market in Hyderabad

అటుగా వెళ్తున్న ప్రయాణికులు దాన్ని గమనించి క్రేన్ డ్రైవర్‌ను అప్రమత్తం చేశారని, అయితే అప్పటికే అతను మరణించాడని అంటున్నారు. క్రేన్ డ్రైవర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిర్లక్ష్యం కారణంగానే ఆ ప్రమాదం జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతుడి వివరాలు తెలియడం లేదు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+