హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పాతబస్తీలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై ఎంఐఎం నేతలు, కార్యకర్తల దాడిని నిరసిస్తూ మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. నల్లజెండాలతో గాంధీభవన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

డీజీపీ కార్యాలయంలోకి దూసుకుపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. 24 గంటల్లో ఎంఐఎం నాయకులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామంటూ హెచ్చరించారు. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.

రౌడీ రాజ్యం నశించాలంటూ నినాదాలు చేశారు. డీసీపీ కమలాసన్ రెడ్డి, అదనపు డీసీపీ రామ్మోహన్ రావులు బందోబస్తు నిర్వహించారు. షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై దాడికి కారణమైన వారిని తక్షణం అదుపులోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము ఆందోళన విరమించే ప్రసక్తిలేదని వారు స్పష్టం చేశారు.

చివరకు నగర అదనపు పోలీసు కమిషనర్ (శాంతి భద్రతలు) అంజనీ కుమార్‌కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రాలను ఇచ్చారు. దీంతో ఎంఐఎంపై చర్యలు తీసుకుంటామని అదనపు డీజీపీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పాతబస్తీలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంట్లోకి ప్రవేశించడం, కొడుకుపై దాడికి పాల్పడ్డంతో మజ్లిస్ ఎమ్మెల్యే బాలాలను అరెస్ట్ చేశారు.

 షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

పాతబస్తీలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై ఎంఐఎం నేతలు, కార్యకర్తల దాడిని నిరసిస్తూ మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది.

 షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

నల్లజెండాలతో గాంధీభవన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డీజీపీ కార్యాలయంలోకి దూసుకుపోయే ప్రయత్నం చేశారు.

 షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. 24 గంటల్లో ఎంఐఎం నాయకులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామంటూ హెచ్చరించారు.

 షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రౌడీ రాజ్యం నశించాలంటూ నినాదాలు చేశారు. డీసీపీ కమలాసన్ రెడ్డి, అదనపు డీసీపీ రామ్మోహన్ రావులు బందోబస్తు నిర్వహించారు.

 షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై దాడికి కారణమైన వారిని తక్షణం అదుపులోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము ఆందోళన విరమించే ప్రసక్తిలేదని వారు స్పష్టం చేశారు.

 షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

చివరకు నగర అదనపు పోలీసు కమిషనర్ (శాంతి భద్రతలు) అంజనీ కుమార్‌కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రాలను ఇచ్చారు. దీంతో ఎంఐఎంపై చర్యలు తీసుకుంటామని అదనపు డీజీపీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

 షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

పాతబస్తీలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంట్లోకి ప్రవేశించడం, కొడుకుపై దాడికి పాల్పడ్డంతో మజ్లిస్ ఎమ్మెల్యే బాలాలను అరెస్ట్ చేశారు.

షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

అజం ఆలీ పాతబస్తీలోని అజంపురలో ఉన్న ఉప ముఖ్యమంత్రి సీఎం మహమూద్ ఆలీ నివాసంపై ఎమ్మెల్యే బలాలతో కలిసి వచ్చిన మజ్లిస్ కార్యకర్తలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

ఈ దాడిలో మహమూద్ ఆలీ కుమారుడు అజం ఆలీ గాయపడ్డారు. అనంతరం అజం ఆలీ మీడియాతో మాట్లాడారు. ఓటమి భయంతోనే మజ్లిస్ దాడులకు పాల్పడుతోందన్నారు.
 షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

మజ్లిస్ భయపెడితే తాము భయపడబోమన్నారు. మజ్లిస్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు.

షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

షబ్బీర్ అలీ, ఉత్తమ్‌పై దాడి: డీజీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా

దాడి సమాచారం తెలిసిన వెంటనే హోం మంత్రి నాయిని నర్సింహ రెడ్డి పాతబస్తీకి వెళ్లారు. మహమూద్ ఆలీ నివాసానికి వెళ్లి మహమూద్ ఆలీని, అజం ఆలీని పరామర్శించారు.

English summary
Congress Leaders protest at DGP office at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X