హైదరాబాద్‌లో మరో 3 మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు, 16వేల కోట్ల పెట్టుబడి
హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. పలు అంతర్జాతీయ సంస్థలు తమ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో డేటా సెంటర్‌ను విస్తరించనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

హైదరాబాద్‌లో 16వేల కోట్లతో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు
హైదరాబాద్‌లో కొత్తగా మూడు డేటా సెంటర్లు ఏర్పాట్లు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. రూ. 16వేల కోట్ల వ్యయంతో హైదరాబాద్ నగరంలో 3 డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని 2022లోనే ప్రకటించింది. వీటికి అదనంగా రూ. 16వేల కోట్ల పెట్టుబడితో మరో మూడు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది.
ఒక్కో డేటా సెంటర్ సగటున 100 మెగావాట్ల ఐటీ లోడ్ ను అందిస్తుండగా.. వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో దశలవారీగా మొత్తం 6 డేటా సెంటర్లు అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.

తెలంగాణ సర్కారుతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం
ఈ మేరకు దావోస్‌లోని మైక్రోసాఫ్ట్ కేఫ్‌లో రాబోయే ప్రాజెక్టులపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌తో జరిపిన చర్చల్లో మైక్రోసాఫ్ట్ ఆసియా అధ్యక్షుడు అహ్మద్ మజర్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పెట్టుబడి అనుకూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నైపుణ్యం, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్, క్లౌడ్ అడాప్షన్ వంటి అనేక ప్రయోజనకరమైన కార్యకలాపాలను ప్రారంభించడానికి తెలంగాణ గతంలో మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

మైక్రోసాఫ్ట్ నిర్ణయంపై కేటీఆర్ హర్షం
క్లౌడ్ ఆధారిత మౌలిక వసతులను పెంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకే మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ చెప్పారు.ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ నిర్ణయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ అభివృద్ధిని కొనసాగించాలని తాను ఎదురుచూస్తున్నాన్నారు.
మరోవైపు, హైదరాబాద్ గ్లోబల్ కేపబులుటీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెబ్ పిటీ సంస్థ ప్రకటించింది. రూ. 150 కోట్లతో నెలకొల్పే ఈ కేంద్రం ఔట్ పేషెంట్ రీహాబిలిటేషన్ థెరపీలో రోగులు, వైద్య సంస్థలకు అవసరమయ్యే డిజిటల్ సేవలను అందించనుంది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications