పాల బావి రహస్యం: కరోనా మహమ్మారి కూడా తోకముడిచింది, దూద్ బౌలి విశేషాలు

కరీంనగర్: బావుల్లో ఎక్కడైనా నీళ్లు నీలం రంగులోనే ఉంటాయి. కానీ, ఇక్కడి బావిలో మాత్రం నీళ్లు.. పాలలా తెల్లగా ఉంటాయి. నీళ్లు పాలలా ఉండటంతో ఈ బావిని పాల బావి అని పిలవడం జరుగుతోంది. అంతేగాక, ఈ పాలలాంటి నీళ్లు తాగితే రోగ బాధలు కూడా ఉండవట. ఇంతకీ ఈ బావి ఎక్కడుందో తెలుసా.? కరీంనగర్ జిల్లాలో.

సర్వరోగ నివారిణి ఈ దూద్ బౌలి

సర్వరోగ నివారిణి ఈ దూద్ బౌలి

కరీంనగర్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలోని శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో ఈ పురాతన పాల బావి ఉంది. నీళ్లు పాలలా ఉండటంతో నిజాం కాలం నుంచీ దీన్ని దూద్ బౌలీగా పిలుస్తున్నారు. ఈ బావిలోని నీరు సర్వరోగ నివారిణి అని స్థానికులు చెబుతున్నారు. అంతేగాక, వేసవి కాలంలోనూ ఈ బావిలో నీరు ఇంకిపోదట.

పాల బావి నీరు తాగినవారికి కరోనా కూడా సోకలేదు

పాల బావి నీరు తాగినవారికి కరోనా కూడా సోకలేదు

చుట్టూ పెద్ద గుట్టలు, రాతి గోడల మధ్య ఉన్న ఈ బావిలో పాల వంటి స్వచ్ఛమైన నీళ్లు ఉన్నాయి. ఈ బావిలో నీళ్లు తాగితే ఎలాంటి రోగాలు రావని, వచ్చినవారు తాగితే నయమైపోతాయని స్థానికులు చెబుతున్నారు. అంతేగాక, కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ బావిలో నీరు తాగడం వల్ల స్థానికంగా ఉండే గ్రామాల ప్రజలకు కరోనా కూడా సోకలేదట. అందుకే ఈ బావిలో నీరు తాగేందుకు చుట్టూ గ్రామాల ప్రజలు కూడా తరలివస్తుంటారు.

దూద్ బౌలీ నుంచి నీళ్లు తెప్పించుకుని తాగిన నిజాం నవాబు

దూద్ బౌలీ నుంచి నీళ్లు తెప్పించుకుని తాగిన నిజాం నవాబు

కాగా, మొలంగూర్ బావికి పెద్ద చరిత్రే ఉంది. ఈ బావిలో నీటిని నిజాం నవాబు కూడా తాగేవారట. రోజూ గుర్రం మీద నిజాం నవాబుకు ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్లేవారట. ఔషధ గుణాలు ఉండటంతో ఈ బావి నీటిని హైదరాబాద్ నగరానికి తెప్పించుకుని నిజాం నవాబు తాగేవారని ఇక్కడి పెద్దలు చెబుతుంటారు. నల్లాల ద్వారా గ్రామ ప్రజలకు నీరు అందుతున్నప్పటికీ.. చాలా మంది గ్రామస్తులు ఈ బావి నీటిని తాగడం మాత్రం ఆపలేదు. మరోవైపు, ఈ నీటి ప్రత్యేకతను తెలుసుకునేందుకు జలవనరుల సంస్థ కూడా పరిశోధనలు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు, ఇక్కడి మొలంగూర్ కోట కూడా పర్యాటకులను ఆకట్టుకునేవిధంగా ఉంటుంది. దీంతో పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+