Weather Update: వణికిస్తున్న చలి.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు..

తెలంగాణలో క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలో చలి పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో 12 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉట్నూర్, నార్నూర్, జైనూర్, తిర్యాణి, నేరడిగొండ, పెంబి మండలాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయింది.

మిగతా జిల్లాల్లో కూడా చలి పెరుగుతోంది. ఇటు రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో మూడు రోజులుగా చలిగాలుల తీవ్రత పెరిగింది. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెంలో 12.2 డిగ్రీలు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాబాద్‌లలో 12.6 డిగ్రీలు, మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లిలో 13.8 డిగ్రీలు, కుత్బుల్లాపూర్‌, శామీర్‌పేటలో 14.4 డిగ్రీలు, వికారాబాద్‌ జిల్లా మన్నెగూడలో 12.2 డిగ్రీలు, కోట్‌పల్లిలో 12.4, వికారాబాద్‌లో 12.7డిగ్రీల, అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.

Minimum temperatures are being recorded in Telangana as the intensity of cold weather gradually increases

ఇక రాజధాని హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత పెరుగుతోంది. శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతోన్నాయి. పలు ప్రాంతాల్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో ఉదయం వాకింగ్ వెళ్లే వారి సంఖ్య తగ్గుతోంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అటు ఏపీలో కూడా చలి తీవ్రత పెరుగుతోంది.

పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అల్లూరి సీతారామ‌రాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. ముంచింగిపుట్టులో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయింది. పాడేరులో 12 డిగ్రీలు, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయింది. పగటి పూట ఎండ ఉన్నప్పటికీ రాత్రి కాగానే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయు. చలి తీవ్ర పెరుగుతోన్న నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి, తెల్లవారుజామున అత్యవసరం ఉంటే బయటకు వెళ్లాలని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+