
దమ్ముంటే హైదరాబాద్ రా.. తేల్చుకుందాం; కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు మంత్రి ఎర్రబెల్లి సవాల్!!
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై స్వరం పెంచిన టిఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలను తరిమి కొట్టాలని, బీజేపీ కార్యకర్తలను ఉరికించాలని అనూహ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు.టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తో కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు మంత్రి ఎర్రబెల్లి సవాల్
తెలంగాణ
ప్రజలను
నూకలు
తినమని
చెప్పండి
అన్న
రీతిలో
కేంద్ర
మంత్రి
పీయూష్
గోయల్
మాట్లాడి
ప్రజలను
అవమాన
పరిచారని
మంత్రి
ఎర్రబెల్లి
దయాకర్
రావు
ఫైర్
అయ్యారు.
ధాన్యం
సేకరణతో
పాటుగా
నూకలు
ఎవరు
తింటారో
తేల్చుకుందాం
అంటూ
బీజేపీ
నేతలకు
ఎర్రబెల్లి
దయాకర్
రావు
సవాల్
విసిరారు.
కేంద్ర
మంత్రి
పీయూష్
గోయల్
మూర్ఖంగా
మాట్లాడుతున్నాడని
పేర్కొన్న
మంత్రి
ఎర్రబెల్లి
దయాకర్
రావు
బీజేపీ
ప్రభుత్వాలు
రైతులకు
చేసింది
ఏంటో
తెలంగాణా
ప్రభుత్వం
చేసింది
ఏంటో
బహిరంగ
చర్చ
జరుపుదామంటూ
పేర్కొన్నారు.
పీయూష్
గోయల్
కు
దమ్ముంటే
హైదరాబాద్
కు
చర్చకు
రావాలని
మంత్రి
ఎర్రబెల్లి
సవాల్
విసిరారు.

బీజేపీ నేతలు చిల్లరగాళ్ళు
నిన్నటికి నిన్న కేంద్రంలోని బీజేపీ తీరుకు వ్యతిరేకంగా రైతులంతా ఇళ్లపై నల్ల జెండాను ఎగురవేయాలని బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేయాలని పిలుపునిచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా తెలంగాణ ప్రజలను అవమాన పరిచేలా వ్యాఖ్యలు చేసిన పీయూష్ గోయల్ కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు చిల్లరగాళ్ళు అంటూ వ్యాఖ్యానించారు. కెసిఆర్ కొనకుంటే మేము కొంటామని బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రజలకు చెప్పారని ఇప్పుడు కెసిఆరే కొనాలి అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బిజెపి నేతలు ఇజ్జత్ లేకుండా బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారు అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రానికి వంత పాడుతున్న బీజేపీ నేతలను ఢిల్లీకి తరమాలి
బీజేపీ నేతలు సిగ్గులేకుండా కేంద్రానికి వంతపాడే ధోరణి అవలంబిస్తున్నారని, ఈ పద్ధతిని మానుకోవాలని టు ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ నేతల పై అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్న రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఎంపీలు తెచ్చిన నిధులు లేవని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ రైతులను పట్టించుకోకుండా కేంద్రానికి వంత పాడుతున్న బిజెపి నేతలను ఢిల్లీకి తరమాలి అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. వడ్లు కొనే దాకా బిజెపి నేతలను గ్రామాల్లో అడుగుపెట్టని వద్దని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

బండి సంజయ్, కిషన్ రెడ్డిలపై ఎర్రబెల్లి ఫైర్
వ్యవసాయ చట్టాల పై రైతులు కేంద్రం మెడలు వంచినట్టే, తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసే వరకూ తెలంగాణ రైతులు ఉద్యమిస్తాం ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు సిగ్గుండాలి అని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కేంద్రంతో ధాన్యం కొనిపించేలా వారు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి దయాకర్ రావు పేర్కొన్నారు. కేంద్రం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు అని, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే వ్యవసాయానికి వైభవాన్ని తీసుకు వచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

తెలంగాణా ప్రజలంతా ఏకమై ఉద్యమించాలి
రైతు అనుకూల విధానాల వల్ల ఈ రోజు రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. మా నాన్న బ్రతికుంటే కెసిఆర్ విధానాలతో బతికున్న వ్యవసాయాన్ని చూసి సంతోషించే వారిని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రైతులకు నష్టం చేస్తున్న బీజేపీ ప్రభుత్వంపై, బీజేపీ విధానాలపై తెలంగాణ ప్రజలంతా ఏక తాటి మీదికి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు బిజెపి ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.