వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రామాలలో బీజేపీ కార్యకర్తలను ఉరికించండి.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రంలోని అధికార బీజేపీ ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్లకు మెంటల్ అని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు, వాళ్ళు కావాలనే ప్రజలను తికమక పెడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర వరి ధాన్యం వద్దంటే రాష్ట్రంలో బిజెపి నాయకులు వేయమని చెప్తున్నారని ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మెంటల్ బీజేపీ నేతలను గ్రామాల్లోకి రాకుండా ఉరికించాలని ఎర్రబెల్లి షాకింగ్ కామెంట్స్ చేశారు.

కేంద్రంపై కేసీఆర్ ద్విముఖపోరు; బీజేపీపై ఒత్తిడి పెంచేలా ఢిల్లీ నుండి గల్లీదాకా ఆందోళనలుకేంద్రంపై కేసీఆర్ ద్విముఖపోరు; బీజేపీపై ఒత్తిడి పెంచేలా ఢిల్లీ నుండి గల్లీదాకా ఆందోళనలు

 ఇళ్ళపై నల్ల జెండాలు పెట్టండి.. బీజేపీ దిష్టి బొమ్మలు దహనం చెయ్యండి: మంత్రి ఎర్రబెల్లి

ఇళ్ళపై నల్ల జెండాలు పెట్టండి.. బీజేపీ దిష్టి బొమ్మలు దహనం చెయ్యండి: మంత్రి ఎర్రబెల్లి


కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ యాసంగి ధాన్యం మొత్తాన్ని పంజాబ్ తరహాలో కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ఘనపూర్ లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ సన్నాహక సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన అనేక తీవ్ర వ్యాఖ్యలు చేశారు . బిజెపి నాయకులు మెంటల్ వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని, గ్రామాల్లోకి రాకుండా వారిని అడ్డుకోవాలంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలను ఉరికించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విరుచుకుపడ్డారు. గ్రామాల్లో రైతులు సంఘటితమై కేంద్రానికి వ్యతిరేకంగా ఇళ్లపై నల్ల జెండాలు కట్టి, బిజెపి దిష్టిబొమ్మలు తగలబెట్టడం ద్వారా తమ నిరసన తెలియజేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

 యాసంగి ధాన్యం కొనే వరకు కూడా వదిలిపెట్టేది లేదు: ఎర్రబెల్లి

యాసంగి ధాన్యం కొనే వరకు కూడా వదిలిపెట్టేది లేదు: ఎర్రబెల్లి


ముఖ్యమంత్రి కేంద్రం తీరుకు బాధతో వరి సాగు చేయొద్దని చెప్పారు తప్ప తెలంగాణ రైతాంగం పట్ల ఆయనకు ఎటువంటి వివక్ష లేదన్నారు. కేంద్రం రా రైస్ కొనడం మాత్రమే కాదు, యాసంగి ధాన్యం కొనే వరకు కూడా వదిలిపెట్టేది లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు తేల్చిచెప్పారు. పంజాబ్ లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని, అదే విధంగా తెలంగాణలో కూడా మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఉక్కు ఫ్యాక్టరీ కి భూమి ఇచ్చినా ఇవ్వలేదన్న మెంటల్ పార్టీ బిజెపి అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.

అబద్దాల బీజేపీపై పోరాటం ఆపొద్దు

అబద్దాల బీజేపీపై పోరాటం ఆపొద్దు


డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్న అబద్ధాల బీజేపీపై పోరాటం చెయ్యాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఎన్నికల కోసం మొన్నటిదాకా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచకుండా ఆపి, ఇప్పుడు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నారంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. కేంద్రం రాష్ట్రంలో ఒక మెడికల్ కళాశాల కూడా ఇవ్వలేదని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 కళాశాలలు ఇచ్చారని వెల్లడించారు. ఎస్సీల వర్గీకరణ కు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎస్టీల రిజర్వేషన్లు పెంచుకోవడానికి ఒప్పుకోవడం లేదన్నారు .

 మోటార్లకు మీటర్లు.. బీజేపీని ఏం చేద్దాం

మోటార్లకు మీటర్లు.. బీజేపీని ఏం చేద్దాం


మోటార్లకు మీటర్లు పెడతామని చెప్తున్నారని కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో ఒక్కో మోటార్ మీటరుకు 75 వేల కరెంటు బిల్లు వస్తుందని పేర్కొన్న మంత్రి బీజేపీని ఏంచేద్దాం అంటూ ప్రశ్నించారు. తన అనుభవంలో కెసిఆర్ వంటి సీఎంని ఎక్కడా చూడలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఒక్కో నియోజకవర్గానికి దళిత బంధు 1500 మందికి, పెన్షన్లు 14 వేల మందికి, ఏడాదికి మూడు వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వనున్నామని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు.

 అందరూ తీర్మానాలు చెయ్యండి.. కేంద్ర వైఖరికి నిరసనగా యుద్ధానికి రెడీ అవ్వండి

అందరూ తీర్మానాలు చెయ్యండి.. కేంద్ర వైఖరికి నిరసనగా యుద్ధానికి రెడీ అవ్వండి


స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం లో డిగ్రీ కళాశాల, ఆసుపత్రి, ప్రతి గ్రామానికి 20 లక్షల రూపాయల నిధులు, చిలుకూరు దేవాలయానికి 25 కోట్లు అడిగారని అవన్నీ పూర్తి చేసుకున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు. అన్ని గ్రామాల సర్పంచులు తీర్మానాలు చేయాలని, 27వ తేదీన మండల సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేయాలని, 30వ తేదీన జిల్లా పరిషత్ లు సమావేశమై కేంద్ర వైఖరికి నిరసనగా తీర్మానాలు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.

English summary
Minister Errabelli Dayakar Rao made shocking comments that mental BJP leaders should be expelled from the villages. Minister Errabelli called for the erection of black flags on houses and the burning of BJP effigies in protest of the Centre's stance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X