బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు: మండిపడ్డ మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని, సీఎం కేసీఆర్ ను గద్దె దించి కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో టిఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, సీఎం కేసీఆర్ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా, వారికి అండగా బీజేపీ నిలుస్తుందని హామీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ తన పాదయాత్ర ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.

బండి సంజయ్ పాదయాత్రపై ఘాటుగా స్పందించిన మంత్రి ఎర్రబెల్లి
ఇదిలా ఉంటే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలలో ముగిసి ప్రస్తుతం జనగామ జిల్లాకు చేరుకుంది. నేటి నుండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనున్న నేపథ్యంలోఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బండి సంజయ్ పాదయాత్రపై ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ ఏ మొహం పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిలదీశారు.

బండి సంజయ్ కేంద్రం నుండి నిధులు తెచ్చి మాట్లాడాలన్న ఎర్రబెల్లి
ఎనిమిదేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ నిధులు తీసుకువచ్చిన తరువాత మాట్లాడాలని ఎర్రబెల్లి దయాకర్ రావు హితవు పలికారు. దేశంలో అన్ని సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని, దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తెలంగాణా రాష్ట్రంపై కేంద్రం అడుగడుగునా వివక్ష చూపిస్తుందని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.

జనగామ ఒకప్పుడు కరువు ప్రాంతం .. కానీ ఇప్పుడు సస్యశ్యామలం
ఒకప్పుడు జనగామ జిల్లా కరువు ప్రాంతంగా ఉండేదని, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. సాగునీరు అందిస్తూ జనగామ జిల్లా ను కూడా సస్యశ్యామలం చేశామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. రాష్ట్రమంతా సాగునీరందుతోందని, పంటలు పండుతూ, సస్యశ్యామలం గా ఉంటే బండి సంజయ్ పాదయాత్రలు దేనికోసమో చెప్పాలంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు.
Recommended Video


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎర్రబెల్లి .. సామూహిక గీతాలాపన విజయవంతం చెయ్యాలన్న మంత్రి
ఇక నేడు స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా తన నివాసంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో వేడుకలను విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. స్వతంత్ర్య భారత స్ఫూర్తిని చాటేలా గ్రామగ్రామాన వాడవాడలా వజ్రోత్సవ వేడుకలు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications