Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ మతవిద్వేషాలకు బలికావద్దు; బండి సంజయ్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్

ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రులు ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. తాజాగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రంజాన్ పండుగ నాడు బిజెపిని టార్గెట్ చేసే విమర్శలు గుప్పించారు. మతసామరస్యానికి ప్రతీక అయిన భారతదేశంలో బీజేపీ మత విద్వేషాలకు పాల్పడుతున్నదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక బండి సంజయ్ ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు.

హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ లక్ష్యం

హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ లక్ష్యం


హిందూ ముస్లింల అన్నదమ్ముల్లా కలిసి ఉందామని, బిజెపి మత విద్వేషాలకు ఎవరు బలి కావద్దని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తొర్రూర్ మసీదు లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దుబ్బ తండ లో దుర్గమ్మ గుడికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

అధికార దాహంతో మతాల పేరుతో విడదీసి చిచ్చుపెట్టి బీజేపీ పరిపాలన

అధికార దాహంతో మతాల పేరుతో విడదీసి చిచ్చుపెట్టి బీజేపీ పరిపాలన


దేశంలో బీజేపీ అధికార దాహంతో ప్రజలను మతాల పేరుతో విడదీసి చిచ్చుపెట్టి పరిపాలన సాగిస్తోంది అని అన్నారు. బిజెపి కుట్రలకు మత విద్వేషాలకు ప్రజలు బలి కావద్దని ఆయన చెప్పారు. దేశంలో దశాబ్దాలుగా కలిసి ఉన్న విధంగానే హిందూ ముస్లింలంతా అన్నదమ్ముల్లా కలిసి ఉందామని మంత్రి అన్నారు. మసీదు అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయలతో పలు కార్యక్రమాలను చేపడతామని ముస్లిం సోదరులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు .అనంతరం మంత్రి తొర్రూర్ సమీపంలోని దుబ్బ తండాలో దుర్గమ్మ గుడికి శంకుస్థాపన, భూమి పూజ చేశారు. తండాలో త్వరలోనే దుర్గమ్మ గుడి నిర్మాణాన్ని పూర్తి చేసి పండుగ చేసుకుందామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.

బండి సంజయ్ ను టార్గెట్ చేసిన ఎర్రబెల్లి

బండి సంజయ్ ను టార్గెట్ చేసిన ఎర్రబెల్లి

ఇక ఇదే సమయంలో రాష్ట్రంలోని బీజేపీ ని టార్గెట్ చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అబద్దాలు చెప్పడం మానుకోవాలని, వాస్తవాలు చెప్పడం నేర్చుకోవాలని హితవు పలికారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ప్రశాంతంగా ఉంటే పాదయాత్ర చేస్తూ ప్రజలకు బండి సంజయ్ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వమే చెబుతుందని పేర్కొన్నారు దయాకర్ రావు.

బండి సంజయ్ కు మంత్రి ఎర్రబెల్లి సవాల్

బండి సంజయ్ కు మంత్రి ఎర్రబెల్లి సవాల్


ఉపాధిహామీ పథకానికి సంబంధించి నిధుల విషయంలో మూడు నెలల నుండి ఇవ్వడంలేదని తెలంగాణ ప్రభుత్వం పై అసత్యాలు ప్రచారం చేస్తున్న బండి సంజయ్, ఉపాధి హామీ నిధులు నేరుగా బ్యాంకు ఖాతాలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని విషయాన్ని తెలుసుకోవాలంటూ పేర్కొన్నారు. బిజెపి అంటేనే భారతీయ జూటా పార్టీ అంటూ మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం పై బండి సంజయ్ కు అవగాహన లేదని పేర్కొన్నారు. కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలలో ఉపాధి హామీ పథకం ఎలా కొనసాగుతుందో తెలంగాణలో ఎలా కొనసాగుతుందో చర్చించడానికి బండి సంజయ్ తమ వద్దకు రావాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+