అధికారం మ‌ళ్ళీ బీఆర్ఎస్ కే; స‌ర్వేల‌న్నీ నావైపే.. 80వేల మెజార్టీ నాకే: మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తొర్రూర్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అధికారం బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఎవ‌రెన్ని మాయోపాయాలు చేసినా, మాయ‌మాట‌లు చెప్పినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం మ‌ళ్ళీ బిఆర్ఎస్ కే అని స‌ర్వేల‌న్నీ చెబుతున్నాయన్నారు.

ఇక ఇదే సమయంలో పాలకుర్తి నియోజకవర్గంలో గెలుపు తనదేనని, 80వేల మెజార్టీ గ్యారంటీ అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు చేశారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తనకు ఎదురుగా ఎవరు నిలబడిన గెలవలేరని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్‌ లాంటి మూర్ఖులు, దుర్మార్గులు ఏవేవో మాట్లాడుతారు. ప్ర‌తిప‌క్షాల ఝూటా మాట‌లు న‌మ్మొద్దని ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.

inister Errabelli Dayakar Rao

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వారి నుండి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాబోయే ఐదేండ్ల‌ల్లో కావాల్సిన అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు ఇప్పుడే రూపొందించుకుందామని పేర్కొన్న ఎర్రబెల్లి జ‌న‌రంజ‌కంగా పాల‌న చేస్తున్న సిఎం కెసిఆర్ కు జ‌న‌మంతా అండ‌గా ఉండాలన్నారు . కాంగ్రెస్‌, బిజెపిలు కుట్ర‌లను తిప్పి కొట్టాలన్నారు.

వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమని పేర్కొన్న ఎర్రబెల్లి కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పే మాటలు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించిన ఎర్రబెల్లి, 500 రూపాయలకు మించిన పెన్షన్ ఎక్కడైనా ఇస్తున్నారా? రైతుబంధు తరహాలో పెట్టుబడికి నిధులు ఇస్తున్నారా? చెప్పాలన్నారు.

inister Errabelli Dayakar Rao

ఓట్ల కోసం కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్క‌డైనా నిరుద్యోగ భృతి ఇచ్చిన దాఖ‌లాలు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు. రూ.500 ల‌కు మించి ఎక్క‌డైనా పెన్ష‌న్ ఇస్తున్నారా? రూ.2వేల‌కు మించి రైతు బంధు త‌ర‌హాలో పెట్టుబ‌డి కి నిధులు ఇస్తున్నారా? ఆలోచించుకోవాల‌ని ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో అమ‌లు చేయ‌ని విధానాలు, తెలంగాణ‌లో అమ‌లు చేస్తామ‌ని ఎన్నిక‌ల కోసం, ఓట్ల కోసం క‌ల్లబొల్లి కబుర్లు చెబుతున్నార‌ని మంత్రి మండిప‌డ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+