Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీఆర్ఎస్‌కు మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు షాక్.. బీజేపీలో చేరికవెనుక మాస్టర్ ప్లాన్!!

టీఆర్ఎస్ పార్టీకి, గులాబీ బాస్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు షాక్ ఇవ్వబోతున్నారా? త్వరలో టీఆర్ఎస్ పార్టీని వీడి కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారా? టిఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు తమ్ముడు ఊహించని ఝలక్ ఇవ్వబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇక ఇదే సమయంలో టిఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అన్న వార్తల వెనుక వరంగల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

టీఆర్ఎస్ లో అవకాశం రాక.. పార్టీ మారే యోచనలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు

టీఆర్ఎస్ లో అవకాశం రాక.. పార్టీ మారే యోచనలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు

ఎర్రబెల్లి ప్రదీప్ రావు.. టిఆర్ఎస్ పార్టీ నాయకుడు. చాలా కాలంగా టిఆర్ఎస్ పార్టీలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేత. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి జిల్లాలో రాజకీయం చేసిన నేత. ఇక అటువంటి ఎర్రబెల్లి ప్రదీప్ రావు చాలా కాలంగా టిఆర్ఎస్ పార్టీలో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలో ఎమ్మెల్యే టికెట్ ను ఆశించారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే బాగుండని ఎదురు చూశారు. కానీ టిఆర్ఎస్ పార్టీలో ఆయనకు ఇప్పటివరకు అవకాశం దక్కకపోవడంతో, భవిష్యత్తులో కూడా అవకాశం దక్కుతుంది అన్న నమ్మకం లేకపోవడంతో ఆయన పార్టీ మారాలని గట్టిగానే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

వరంగల్ తూర్పును టార్గెట్ చేస్తున్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు .. బీజేపీ తీర్ధం వెనుక మతలబు ఇదే

వరంగల్ తూర్పును టార్గెట్ చేస్తున్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు .. బీజేపీ తీర్ధం వెనుక మతలబు ఇదే

వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాలని వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ఈ నేపథ్యంలోనే బిజెపి తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. వరంగల్ తూర్పు నియోజకవర్గాల భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేయడానికి, బలమైన నేత లేరని భావిస్తున్న నేపథ్యంలో, తనకు బిజెపి నుండే అవకాశం వస్తుందని ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీ మారడానికి రెడీ అయ్యారని తెలుస్తుంది.

ఎర్రబెల్లి ప్రదీప్ రావు నిర్ణయం వెనుక రీజన్ ఇదే

ఎర్రబెల్లి ప్రదీప్ రావు నిర్ణయం వెనుక రీజన్ ఇదే

జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చక్రం తిప్పుతున్నప్పటికీ, తమ్ముడికి రాజకీయంగా మెరుగైన పదవి దక్కేలా చూడడంలో ఎర్రబెల్లి దయాకర్ రావు విఫలమయ్యారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న నన్నపనేని నరేందర్, అడుగడుగున ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు చెక్ పెడుతూ వచ్చారు. ఇక టిఆర్ఎస్ పార్టీలో తనకు టిక్కెట్ వస్తుందని ఆశలు అడుగంటడంతో, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఎర్రబెల్లి ఫ్యామిలీలో కలకలం .. జిల్లాలో ఆసక్తికర చర్చ

ఎర్రబెల్లి ఫ్యామిలీలో కలకలం .. జిల్లాలో ఆసక్తికర చర్చ

కాంగ్రెస్ పార్టీ నుండి కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి మరో నేత వేం నరేందర్ రెడ్డి కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి తనకు అవకాశం లేదని భావిస్తున్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీ తీర్థం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీసుకున్న నిర్ణయం ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంట్లో కలకలం రేపుతుంది. అన్న టిఆర్ఎస్ లో, తమ్ముడు బిజెపిలో.. విచిత్రమైన రాజకీయం అంటూ చర్చ జరుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+