Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హుజురాబాద్‌కు ఈటల చేసిందేమీ లేదు.. సొంత పనుల కోసమే కేసీఆర్ వద్దకు వెళ్లేవారు : మంత్రి గంగుల

రెండుసార్లు మంత్రిగా పనిచేసినప్పటికీ హుజురాబాద్ నియోజకవర్గానికి ఈటల రాజేందర్ చేసిందేమీ లేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. మంత్రిగా ఉన్నప్పుడే ఏమీ చేయలేని వ్యక్తి ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నప్పుడు కేవలం సొంత పనుల కోసమే సీఎం కేసీఆర్‌ వద్దకు వెళ్లి కలిసేవారు తప్ప నియోజకవర్గ పనుల కోసం ఏనాడూ వెళ్లలేదన్నారు.

తమ తమ నియోజకవర్గాల్లో పరిస్థితిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే రూ.31కోట్లు మంజూరు చేశారని గంగుల పేర్కొన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ జరగని అభివృద్దిని ఈ ఏడేళ్లలో కేసీఆర్ చేశారని చెప్పారు. దేశంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్‌ను హుజురాబాద్ ప్రజలు ఇక నమ్మరని...ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.

 minister gangula kamalakar slams etela rajender over huzurabad development

మరోవైపు,బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి దళిత జాతిని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు నిజంగా దళితులపై ప్రేమ,వారు అభివృద్ది చెందాలన్న కాంక్ష ఉంటే... ఈ ఏడేళ్లలో ఆ జాతి ఎంతగానో అభివృద్ది చెందేదన్నారు. కేవలం తూతూ మంత్రంగా దళితుల కోసం పనిచేయడమే తప్పితే... కడుపునిండా ఆ జాతిని ఆదుకునే ప్రయత్నం చేయలేదన్నారు. దళితుల అభివృద్దికి ప్రత్యేక పథకాలేమీ చేపట్టకపోగా ఈ ఏడేళ్లలో కేసీఆర్ దళిత జాతిని అవమానించారని ఈటల ఆరోపించారు.

రాష్ట్రంలో 18 శాతం పైచిలుకు ఉన్న దళిత జనాభాకు సరైన ప్రాతినిధ్యం లేదన్నారు. దళిత ఐఏఎస్ అధికారులను కేసీఆర్ అవమానించారని ఆరోపించారు.కేసీఆర్‌కు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే.. జనాభా ప్రాతిపదికన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి ట్యాంక్ బండ్‌పై విగ్రహాల కోసం,సిమెంట్ రోడ్ల కోసం,సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెడుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ ఏడేళ్ల కాలంలో దళితుల కోసం కనీసం రూ.1వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినట్లు చూపించగలరా అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టడం ద్వారా మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+