• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్తీ మే సవాల్: ‘బీడీ’పెన్షన్ కేంద్రం ఇస్తే రాజీనామా చేస్తా.. ముక్కునేలకు రాస్తావా: హరీశ్ రావు

|
Google Oneindia TeluguNews

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం మరింత ఊపందుకొంది. టీఆర్ఎస్ తరఫున రంగంలోకి దిగిన మంత్రి హరీశ్ రావు.. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లక్ష్యంగా విమర్శలు చేశారు. మంత్రి హరీశ్ రావు సవాల్‌తో దుబ్బాక బై పోల్ మరింత హీటెక్కింది. మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఉప ఎన్నికలో అబద్దాలు చెప్పి రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ నేతలు చూస్తున్నారని హరీశ్ రావు విరుచుకుపడ్డారు. ఇదీ మంచి పద్దతి కాదని.. తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

కాకి రెట్టంత కూడా చేయలే, గోబెల్స్ ప్రచారం: దుబ్బాక బై పోల్‌ క్యాంపెయిన్‌లో హరీశ్ రావు..కాకి రెట్టంత కూడా చేయలే, గోబెల్స్ ప్రచారం: దుబ్బాక బై పోల్‌ క్యాంపెయిన్‌లో హరీశ్ రావు..

బస్తీ మే సవాల్..

బస్తీ మే సవాల్..

వృద్దాప్య, బీడీ కార్మికుల పెన్షన్, కేసీఆర్ కిట్‌పై బీజేపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. నిజంగా బీడీ కార్మికులకు, కేసీఆర్ కిట్‌కు కేంద్రం నిధులు ఇస్తే తాను ఆర్థికమంత్రి పదవీకి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని చెప్పారు. అదీ అబద్దమైతే దుబ్బాక పాత బస్తాండ్ ముక్కునేలకు రాస్తావా అని సవాల్ విసిరారు. ఎంపీ పదవీకి రాజీనామా చేయాలని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీకి కూడా రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు.

 పైసా ఇవ్వడం లేదు..

పైసా ఇవ్వడం లేదు..

బీడీ కార్మికుల‌కు ఇచ్చే పెన్ష‌న్‌లో కేంద్రమే రూ. 1600 ఇస్తుంద‌ని, రాష్ర్టం కేవ‌లం రూ. 400 ఇస్తుందని బీజేపీ నేతుల చెప్పారు. బీడీ కార్మికుల‌కు కేంద్రం 16 పైస‌లు కూడా ఇవ్వ‌డం లేద‌ని హ‌రీష్ రావు తేల్చిచెప్పారు. నిజ‌మే అయితే చ‌ర్చ‌కు సిద్ధంగా ఉండాల‌ని బండి సంజ‌య్‌కు హ‌రీష్ రావు స‌వాల్ విసిరారు. దుబ్బాక పాత బ‌స్టాండ్ వ‌ద్ద ప్ర‌జ‌ల మ‌ధ్యే చ‌ర్చ పెడదామ‌ని కోరారు. బీడీ కార్మికుల‌కు కేంద్రం రూ. 1600 పెన్ష‌న్లు ఇస్తున్న‌ట్లు నిరూపిస్తే తాను ఆర్థిక మంత్రి ప‌ద‌వికి, సిద్దిపేట ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. నిరూపించ‌క‌పోతే బండి సంజ‌య్ అదే పాత బ‌స్టాండ్ వ‌ద్ద ముక్కు నేల‌కు రాస్తావా? అని హ‌రీష్ రావు స‌వాల్ విసిరారు. దీనికి సిద్ధ‌మనుకుంటే.. బీజేపీ నాయ‌కులే తేదీని డిసైడ్ చేయాల‌న్నారు.

 మేమమామగా కేసీఆర్..

మేమమామగా కేసీఆర్..

రాష్ట్రంలోని ప్రజలకు మేనమామగా కేసీఆర్ అండగా నిలిచారని చెప్పారు. అందుకోసమే కేసీఆర్ కిట్ అందజేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ కిట్ వ్యయం రూ.2 వేలు అని.. మరీ రూ.10 వేలు ఎలా ఖర్చవుతుందో తెలుపాలని కోరారు. బీజేపీ రూ.8 వేలు ఇస్తే మోడీ కిట్ అని ఎందుకు పెట్టడం లేదు అని అడిగారు. అధికారంలో ఉన్న కర్ణాటకలో కిట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఊరికే మాట్లాడటం కాదు అని.. చేతలు చూపించాలని హరీశ్ రావు హితవు పలికారు.

అబద్దపు పునాదుల మీద రాజకీయాలు..

అబద్దపు పునాదుల మీద రాజకీయాలు..

అబ‌ద్ద‌పు పునాదుల మీద రాజ‌కీయాలు చేస్తామంటే డిపాజిట్ గ‌ల్లంతు అవ‌డం త‌ప్ప సాధించేదేమీ ఉండదు అని హరీశ్ రావు అన్నారు. అబద్దాలు చెప్ప‌డం సరికాదన్నారు. ఇతర పార్టీల మీద బ‌ట్ట కాల్చి మీద వేయడం ఏంటీ అని మండిపడ్డారు. దీతో దుబ్బాక ప్ర‌జ‌లు వాస్త‌వాల‌ను గ‌మ‌నించాలని కోరారు. హుజుర్‌న‌గ‌ర్‌లో అబ‌ద్దాలు చెప్పినందుకే బీజేపీ అభ్య‌ర్థిని నాలుగో స్థానంలో నిల‌బెట్టారని హరీశ్ రావు గుర్తుచేశారు. ప‌చ్చి అబ‌ద్దాలు చెబుతోన్న బీజేపీ నాయ‌కుల‌కు దుబ్బాక ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. తెలంగాణ‌పై ప్రేమ ఉంటే కాళేశ్వ‌రం ప్రాజెక్టు జాతీయ హోదా ఇసుతీకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.

English summary
minister harish rao challenge to bjp chief bandi sanjay on bd pension issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X