వందేభారత్ రైళ్ల ప్రారంభానికి కేసీఆర్ ను ఆహ్వానించారా?తమిళిసైకి మంత్రి హరీష్ రావు కౌంటర్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. నూతన సచివాలయానికి తనకు ఆహ్వానం రాలేదని గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలకు గవర్నర్ ను పిలవాలని ఏ రాజ్యాంగంలో అయినా రాసి ఉందా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ లో వందే భారత్ రైళ్ల ప్రారంభానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడు కేసీఆర్ కు ఆహ్వానం ఇచ్చారా అంటూ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.

గవర్నర్ కు కొన్ని ప్రత్యేకమైన విధులు ఉంటాయని, ఆ విధులకు లోబడి మాత్రమే గవర్నర్ పని చేయాల్సి ఉంటుందని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రధాని మోడీ వందే భారత్ రైలును రాష్ట్రపతిని పిలవకుండానే ప్రారంభించారు కదా అంటూ పేర్కొన్న హరీష్ రావు ప్రతిదానికి రాద్ధాంతం చేయడం వారికి అలవాటుగా మారింది అంటూ అసహనం వ్యక్తం చేశారు.

Minister Harish Rao counters Tamilisai: Has KCR been invited for Vande Bharat trains Launch?

ఇటీవల మూడు పెండింగ్ బిల్లులకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడం పై స్పందించిన హరీష్ రావు గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ ఏ ఉద్దేశంతో పక్కన పెట్టారో చెప్పాలని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కేంద్రం స్వతంత్ర వ్యవస్థలను రాజకీయంగా వాడుకుంటోందని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ ఈ ఏడు నెలల పాటు ఆపారని, దాని వెనుక రాజకీయం ఏమిటో అందరికీ తెలుసు అని హరీష్ రావు అన్నారు. తాము కోర్టులకు వెళ్లి కేసులు వేస్తే తప్ప బిల్లులు పాస్ కాని పరిస్థితి ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఎక్కడి నుండో ఆదేశాలు వస్తే రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారని మంత్రి హరీష్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

గవర్నర్ రాష్ట్ర ప్రగతి సహకరించకుండా మోకాలు అడ్డుపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇస్తామని చెబితే ఏడు నెలల నుండి ఆపి ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపించాము అని చెప్పడం దారుణమన్నారు. యూనివర్సిటీలలో విద్యార్థులకు చదువులు చెప్పే ప్రొఫెసర్లు వద్దా అంటూ హరీష్ రావు మండిపడ్డారు. ఇవంతా బిజెపి చేస్తున్న కుట్రలనీ, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని హరీష్ రావు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+