వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి గారి హీరోయిజం.!ప్రమాదం చేసి పరారవుతున్న డ్రైవర్‌ ను ఛైజ్ చేసి పట్టుకున్న శ్రీనివాస్‌ గౌడ్‌.!

|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్/హైదరాబాద్ : అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు.. ఒకేలా వ్యవహరించరు అనడానికి ఇప్పుడు చెప్పుకోబోయే అంశంమే పెద్ద ఉదాహరణ. కళ్ల ముందు జరుగుతున్న ఎన్నో సంఘటనలను చూసి చూనట్టు వదిలేస్తాం. ఇక మన ముందు ఏదైనా ప్రమాదం జరిగితే మనకెందులే అని ఇమ్మిడియెట్ గా సైడైపోతాం. ఇది చాలా మందిలో సహజంగా ఉండే లక్షణం. కొందరికి మాత్రమే ఒక రకమైన తెగింపు, ధైర్యం ఉంటాయి. జరుగుతున్న పరిణాలపట్ల స్పందించితీరాలనే పట్టుదల, కసి కూడా కనిపిస్తుంటుంది. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇలాంటి తెగువను చూపించి శభాష్ మంత్రి గారూ అనిపించుకున్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెగింపు..

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెగింపు..

ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనలోని హీరోయిజాన్ని చాటుకున్నారు. నలుగురితో నారాయణ అనుకోకుండా జరిగిన దుర్ఘటన పట్ల సమయస్పూర్తిగా వ్యవహరించి ఓ అమాయకుడికి న్యాయం చేసారు. రహదారుల పైన వాహనాలు ఎంత వేగంగా వెళ్తుంటాయో, ప్రమాదాలు కూడా అంతే వేగంగా చోటుచేసుకుంటాయి. రహదారుల మీద వెళ్తున్నప్పుడు ఏ కొంచె ఏమరుపాటు ప్రదర్శించినా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఏదో చిన్న పొరపాటు వల్ల ప్రమాదం బారిన పిడిపోవాల్సిందే. ఇలాంటి సంఘటనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి ప్రత్యక్షంగా ఎదురైంది. అందుకు ఆయన రియాక్షన్ కూడా వేరే లెవల్ ఉన్నట్టు తెలుస్తోంది.

మనకెందుకులే అనుకునే రోజులు..

మనకెందుకులే అనుకునే రోజులు..

సాధారణంగా రహదారుల మీద ప్రమాదాలు జరిగితే కొంతమంది వాహనాలు ఆపి ప్రమాదానికి గురైన సదరు వ్యక్తులను దగ్గలోని ఆసుపత్రులకు పంపించి తమ మానవత్వాన్ని చాటుకుంటారు. కొంత మంది పోలీసులకు సమాచారం ఇస్తారు. మరి కొంత మంది 108 కి ఫోన్ చేసి అత్యవసరంగా వైద్య సాయం అందిస్తారు. ఇది సమజంగా జరిగిపోయే ప్రక్రియ. కాని కొందరు ప్రమాదం చేసి తాపీగా వెళ్లి పోతుంటారు. ప్రమాదానికి గురైన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది అని కనీసం ఆలోచించకుండా వేగంగా అక్కడనుండి ఉడాయించేస్తారు, సరిగ్గి ఇలాంటి సంఘటనే మహబూబ్ నగర్ హైవే మీద ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఎదురైంది.

 ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి ఉడాయిస్తున్న బొలేరో..

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి ఉడాయిస్తున్న బొలేరో..

తన కళ్ల ముందే ఓ బైకును ఢీకొని పరారయ్యేందుకు ప్రయత్నించిన వాహనాన్ని ఛేజ్ చేసి పట్టుకున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మంత్రి కాన్వాయ్ హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వస్తున్న క్రమంలో రాజాపూర్ సమీపంలో ముదిరెడ్డిపల్లికి చెందిన 36 సంవత్సరాల శ్రీనివాస్ బాలానగర్ నుంచి సొంతూరుకు బైక్ పై వస్తున్నాడు.హైదరాబాద్ నుంచే కర్ణాటక వెళ్తున్న బొలెరో వాహనాం రాజాపూర్ శివారులో బైక్ ను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. అప్పుడు అటుగా వస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన వాహనాన్ని వేగంగా ముందుకు తీసుకుపోమని డ్రైవర్‌ను ఆదేశించారు. ఆక్సిడెంట్ చేసి పరారవుతున్న కర్ణాటకకు చెందిన బొలెరోను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.

ప్రమాదం చేసిన బొలేరో డ్రైవర్ ను స్టేషన్ కు..

ప్రమాదం చేసిన బొలేరో డ్రైవర్ ను స్టేషన్ కు..

బైక్ ను ఢీకొట్టి తప్పించుకునే ప్రయత్నం చేసిన బొలెరో వాహనాన్ని దాదాపు మూడు కిలోమీటర్ల వరకూ ఛేజ్ చేసి పట్టుకున్నారు శ్రీనివాస గౌడ్. మంత్రి వాహనాన్ని అడ్డంగా పెట్టి బొలెరో వాహనాన్ని ఆపారు. అనంతరం డ్రైవర్‌ పై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసుకు విజ్ఞప్తి చేసారు మంత్రి. గాయపడిన శ్రీనివాస్ ను రాజాపూర్ పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేసి మహబూబ్ నగర్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్ కు పంపించారు. తన కళ్ల ముందే ప్రమాదాన్ని చూసి వెంటనే మానవత్వంతో స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వల్లే బాధితునికి వెంటనే చికిత్స అందిందని స్థానికులు చర్చించుకున్న సందర్బం కనిపించింది. మంత్రి చూపించిన దైర్య సాహసాలకులు స్థానికులు, పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Excise Minister Srinivas Goud chased and caught a vehicle trying to escape after colliding with a bike in front of his eyes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X