మంత్రి జగదీష్ రెడ్డికి తప్పిన ప్రమాదం, కాన్వాయ్ వాహనం ఢీకొని 5 గురికి గాయాలు
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆదివారం నాడు రోడ్డు ప్రమాదం నుండి సురక్షితంగా బటయపడ్డారు.
నల్లగొండ: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆదివారం నాడు రోడ్డు ప్రమాదం నుండి సురక్షితంగా బటయపడ్డారు.
హైద్రాబాద్ నుండి కేతెపల్లిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం నాడు మంత్రి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

మంత్రి కాన్వాయ్ లోని ఓ వాహనం అదుపుతప్పి ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి.మంత్రికి వరుసకు సోదరుడయ్యే కరుణాకర్ రెడ్డి గాయపడ్డారు.
మంత్రి అటెండర్ లింగయ్య, భద్రతాధికారి అవినాష్ రెడ్డి, డ్రైవర్ కృష్ణ,గడ్డిపల్లికిచెందిన సత్యం గాయపడ్డారు. వీరందరిని సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు.

మంత్రి హైద్రాబాద్ నుండి కేతెపల్లి వెళ్తుండగా కట్టంగూరు మండలంలోని ఎరసానిగూడెం వద్ద ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదం నుండి మంత్రి జగదీష్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు.












Click it and Unblock the Notifications