కాంగ్రెస్ ఆధిపత్యపోరులోనే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య: మంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్: నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరులో భాగంగా మాత్రమే జరిగిందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.
బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాపసభలో కాంగ్రెస్ పార్టీ నేతలు టిఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని చేసిన విమర్శలపై మంత్రి జగదీష్ రెడ్డి తిప్పికొట్టారు.తాము ఏనాడూ కూడ కక్షలు, కార్పణ్యాలకు పాల్పడలేదని మంత్రి జగదీస్ రెడ్డి చెప్పారు. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వల్లే చిల్లరగొడవలు వస్తున్నాయని ఆయన చెప్పారు.

నల్గొండ కాంగ్రెస్ పార్టీ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్‌తో తమకు ఎలాంటి గొడవలు లేవని జగదీష్ రెడ్డి చెప్పారు.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.
మరో నియోజకవర్గంలో జరిగిన హత్యకు ఎమ్మెల్యే వీరేశానికి ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగిందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications