ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు - కోమటిరెడ్డి ఆసక్తి కర లెక్కలు..!!
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమరం ముగిసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం కొనసాగుతోంది. ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే చర్చ మొదలైంది. మూడు ప్రధాన పార్టీలు తాము గెలిచే సీట్ల పైన భారీ అంచనాలతో ఉన్నాయి. ఈ సమయంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో తన అంచనాలు వెల్లడించారు. బీఆర్ఎస్ భవిష్యత్ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు.
ఫలితాల తరువాత
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ నేతలు అంతా అటు ఇటు తిరగాల్సిందేనని పేర్కొన్నారు. కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. కవిత జైలు కు వెళ్లిందని, తమ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్టేషన్‌లో కేటీఆర్ ఉన్నారన్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకు, 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినందుకు.. కేటీఆర్ రేవంత్ రెడ్డిని తిడుతున్నారా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో 12 కు తగ్గకుండా కాంగ్రెస్ కు ఎంపీ స్థానాలు వస్తాయన్నారు.

కాంగ్రెస్ కు 12 స్థానాలు
బీఆర్ఎస్‌కు రెండు, మూడు చోట్ల డిపాజిట్ వస్తే ఎక్కువ అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ హాయాంలో మద్యం అమ్మకాలు పెరిగాయి తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. వైన్ షాపుల పేరు మీద 2500 కోట్లు గత ప్రభుత్వం రాబట్టిందని.. టెట్ కు 2 వేలు పెడితే కేటీఆర్ తమను విమర్శిస్తున్నారంటూ కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పాం.. దోడ్డు వడ్లకు ఇవ్వమని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. వచ్చే నెల 6,7,8న తానూ.. శ్రీధర్ బాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నామని చెప్పారు.
విదేశీ పర్యటనకు మంత్రులు
తమ పర్యటనలో వివిధ కంపెనీలతో భేటి అవుతామని తెలిపారు. కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకోలేకపోతున్నారని.. తాము ఇతర రాష్ట్రాలకు వెల్లలేకపోతున్నామంటూ పేర్కొన్నారు. ఎల్బీనగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 14 అంతస్థులకు కుదిస్తామని వెల్లడించారు. బీజేపీ ఫోర్ లీడర్ అయి నెల రోజులు కానీ వ్యక్తి ఆర్టీఐ కింద 70 లెటర్లు పెట్టారన్నారు. సీనియర్ నేత రాజాసింగ్ కు కాదని ఎల్పీ పదవి తీసుకున్నారని,ఆయన పేరు చెప్పాలంటేనే తనకు ఇన్సల్ట్ గా ఉందన్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండానే బీఆర్ఎస్ ఆఫీసులు కట్టారని కోమటిరెడ్డి అన్నారు. వైఎస్సార్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారంటూ కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications