కాస్త విషమిచ్చి చంపేయండి.. మానసికంగా హింసించకండి: మంత్రి కన్నీరు!
మీడియా ఛానళ్ళు, సోషల్ మీడియాలో తనపై వస్తున్నవన్నీ నిరాధారమైన, అసత్యమైన ప్రచారాలు అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారం పై .స్పందించిన మంత్రి కలెక్టర్ల బదిలీలు అనేవి పూర్తిగా ముఖ్యమంత్రి నిర్ణయం అని, తాను మంత్రి అయిన తర్వాత నల్గొండ జిల్లాలో నలుగురు కలెక్టర్లు మారారు అని తెలిపారు.
మహిళా ఐఏఎస్ లపై వస్తున్న ఆరోపణలను ఖండించిన మంత్రి
తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం తగదనీ, ప్రజలు, మీడియా బాధ్యతగా వ్యవహరించాలనీ మంత్రి హితవు పలికారు. తనను మానసికంగా హింసించే బదులు ఒకేసారి ఇంత విషమిచ్చి చంపేయండి అని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇటీవల మంత్రులు మహిళా ఐఏఎస్ ఆఫీసర్ నిమిష వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన బాధ్యతాయుతంగా పనిచేసే ఐఏఎస్ ల పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

రేటింగ్స్, వ్యూస్ కోసం వండి వార్చటం కరెక్ట్ కాదు
మహిళా ఆఫీసర్లను ఇబ్బందులు పెడుతూ ఏం సాధిస్తారు అంటూ ప్రశ్నించారు. ఒక మహిళ ఐఏఎస్ పైన దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు, రేటింగులు, వ్యూస్ కోసం అవాస్తవాలను వండి వార్చడం కరెక్ట్ కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. అడ్డగోలు రాతలు రాయడం మంచిది కాదంటూ హెచ్చరించారు. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది అన్న విషయం మర్చిపోకూడదు అన్నారు.
ఇంత విషమిచ్చి చంపేయండి
తన కొడుకు చనిపోయినప్పుడే తాను సగం చనిపోయానని, తప్పుడు ఆరోపణలతో తనను మానసికంగా హింసించే బదులు విషమిచ్చి చంపేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి అయిన తర్వాత నల్గొండ జిల్లాలో నలుగురు ఐఏఎస్ లు మారారని ఐఏఎస్ ల బదిలీ వ్యవహారంతో తనకు సంబంధమే లేదని ఆయన అన్నారు. మహిళా ఐఏఎస్ ల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయొద్దు అన్నారు.
సమగ్ర దర్యాప్తు చేయించాలని సీఎం ను కోరుతున్నా
ఐఏఎస్ ల బదిలీ సీఎం చూసుకుంటారని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇచ్చారు. మహిళా అధికారుల పైన వారి ప్రతిష్టను దెబ్బ తీసేలా తప్పుడు ప్రచారం చెయ్యొద్దన్నారు. మహిళా ఐఏఎస్ ల పైన వస్తున్న ఆరోపణల పైన సమగ్ర దర్యాప్తు చేయించాలని తాను సీఎంను కోరుతున్నానని పేర్కొన్నారు.
ప్రజాసేవకే జీవితం అంకితం చేసి రాజకీయాలు చేస్తున్నా
తను ఫోన్ నెంబర్ మార్చలేదు అని తన గొంతు సమస్య వల్ల తక్కువ మాట్లాడుతున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తన కుమారుడు మరణించిన దగ్గర నుండి ప్రజాసేవకే ప్రాధాన్యతనిచ్చి రాజకీయాలను చేస్తున్నానని, అనవసరంగా తనను ఇబ్బంది పెట్టవద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications