వరంగల్ వాసులు గాల్లో తేలే వార్త ఇది!

వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. మామునూరు విమానాశ్రయంతో జిల్లా వాసులకు దశాబ్ద కాలం కోరిక నేరవేరిందన్నారు తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.

ఇది తమ సీఎం రేవoతన్న, ఉన్నతాధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు వరంగల్ జిల్లా ప్రజల అదృష్టమని మంత్రి వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా వాసులు గాల్లో తేలే వార్త ఇదని పేర్కొన్నారు. ఓరుగల్లు వాసులు ఎళ్ల తరబడి ఎదురుచూస్తున్న కలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది అన్నారు. మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ శుక్రవారం మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు.

Minister Konda Surekha responds to the Center s green signal for Mamnoor Airport

మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయం అని మంత్రి కొండా సురేఖ అన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అంశంపై తీవ్రంగా చేసినట్టు చెప్పారు. మామునూరు విమానాశ్రయాన్ని అతి త్వరగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆమె వెల్లడించారు.

మామునూరు ఎయిర్ పోర్టుకు సంబంధించిన భూసేకరణ విషయంలో తమ ప్రాంత ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున సహకారం అందించాలని సందర్బంగా మంత్రి కొండా సురేఖ కోరారు. మామునూరు ఎయిర్ పోర్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని కొనియాడారు. జిల్లా మంత్రిగా తాను జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి.. మామునూరు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ నిమిత్తం స్థల పరిశీలన పలుమార్లు చేసినట్టు చెప్పారు.

ఆ సందర్భంలో... గాడిపల్లి గుంటూరుపల్లి, నక్కలపల్లి గ్రామస్తులతో మంత్రి హోదాలో సమావేశమై విమానాశ్రయ ఏర్పాటుకు కావల్సిన 253 ఎకరాల భూసేకరణ నిమిత్తం రైతులతో సంప్రదింపులు జరిపినట్టు కొండా సురేఖ తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వరంగల్ జిల్లా మొత్తం పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+