వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుగా మంత్రి కొప్పుల ఈశ్వర్; కూలీలతో కలిసి పొలం పనులు; భోజనం,మాటామంతీ!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర మంత్రిగా నిత్యం రాజకీయాలలో బిజీగా ఉండే ఆయన తాజాగా రైతన్నగా దర్శనం ఇస్తున్నారు. సొంత నియోజకవర్గం ధర్మపురిలో రైతుగా వ్యవసాయ పనుల్లో కనిపిస్తున్నారు. నిత్యం అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూనే, రైతుల మనసులను గెలుచుకునే పనిలో పడ్డారు. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇటీవల ఎక్కడ పర్యటించినా సరే ముఖ్యంగా పొలం పనులలో సందడి చేస్తున్నారు.

బొమ్మారెడ్డిపల్లిలో పొలం పనుల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల

బొమ్మారెడ్డిపల్లిలో పొలం పనుల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల


పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీల దగ్గరికి వెళ్లి, వారితో కలిసి పొలం పనులు చేస్తున్నారు. మొన్నటికి మొన్న పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మా రెడ్డి పల్లి శివారులో వేణుగోపాల్ రెడ్డి అనే రైతు తన పొలంలో నాట్లు వేస్తుండగా, అటుగా వెళ్తున్న మంత్రి నేరుగా ఆయన పొలంలోకి దిగి రైతులతో కలిసి గొర్రు పొట్టి రసాయన ఎరువులు చల్లారు. ఆపై నారును మహిళ కూలీలకు అందించారు. వారితో కలిసి మాట్లాడుతూ కాసేపు నాట్లు వేశారు. ఇక ఆపై కూలీలతో కలిసి భోజనం చేసి, రైతు కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 తాజాగా జగిత్యాల జిల్లాలోనూ మహిళా కూలీలతో కలిసి నాట్లేసిన కొప్పుల

తాజాగా జగిత్యాల జిల్లాలోనూ మహిళా కూలీలతో కలిసి నాట్లేసిన కొప్పుల

ఇక తాజాగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో వరి నాట్లు సంబరాల కార్యక్రమాల్లో భాగంగా మహిళా రైతులతో కలిసి నాగలితో జంబు కొట్టి నాట్లు వేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. వారితో కలిసి భోజనం చేశారు. చాలా సింపుల్ గా తిరిగే మంత్రి కొప్పుల ఈశ్వర్ తానూ రైతు కుటుంబం నుండి వచ్చిన వాడినని, తన నేపధ్యాన్ని మరచిపోనని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అనంతరం తుమ్మెనాల గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన సి.సి రోడ్ల ను ప్రారంభించారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న పనులు చెప్తున్న కొప్పుల ఈశ్వర్

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న పనులు చెప్తున్న కొప్పుల ఈశ్వర్

ఎక్కడికి వెళ్ళినా నాట్లు వేస్తున్న పొలాలలో కెసీఆర్ అని నారు వేయిస్తూ సందడి చేస్తున్నారు. ఇక రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తుందని, ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ద్వారా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందిస్తుందని, 24 గంటల పాటు ఉచిత కరెంటు అందిస్తుందని, రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రమంతా సస్యశ్యామలంగా మారిందని కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

అందరి వాడిగా ప్రజల్లో తిరుగుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్

అందరి వాడిగా ప్రజల్లో తిరుగుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్


ఇక ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాగులు వంకలు పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు కొప్పుల ఈశ్వర్. నియోజకవర్గంలో ప్రజల సమస్యలను నేరుగా వెళ్లి తెలుసుకుంటున్నారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ఆపై రైతులతో కలిసి వ్యవసాయ పనుల్లో పాలు పంచుకుంటూ, అందరి వాడిగా అందరి మన్ననలు పొందడం కోసం కొప్పుల ఈశ్వర్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు.

English summary
Minister Koppula Eshwar became a farmer working in the fields with the laborers. Minister Koppula Eshwar is busy touring the joint Karimnagar district, plowing with the farmers, sowing paddy plants, and having a meal with them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X