ఈటలపై అభిమానంతోనే ఓటేశారు: అతిగా ఊహించుకోవద్దంటూ కొప్పుల ఈశ్వర్ ఫైర్
హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈటల అహంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నుంచి ఈటలను ఎవరూ పంపలేదని, ఆయనకు ఆయనే పార్టీ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. ఈటల రాష్ట్రమంతటా తిరిగితే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు.

ఈటల అతిగా ఊహించుకుంటున్నారు: కొప్పుల ఈశ్వర్
ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్,ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావుతో కలిసి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈటల అతిగా ఊహించుకోవడం మానుకుంటే మంచిదని హితవు పలికారు. బీజేపీకి వ్యక్తిగీత ఏజెండా ఉండదని.. ఉమ్మడి ఏజెండానే ఉంటుందన్నారు. ఒక్కరోజలోనే ఈటల రాష్ట్రనాయకుడిగా మాట్లాడుతున్నారని.. ఈటల రాష్ట్ర నేత అయితే బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్‌రెడ్డి లాంటి వారి సంగతి ఏంటి? అని ప్రశ్నించారు.

బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కు, రేవంత్‌పైనే దుమ్మెత్తిపోశారంటూ కొప్పుల
జాతీయ స్థాయిలో బీజేపీ-కాంగ్రెస్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందన్నారు కొప్పుల. అయితే రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయన్నారు. కాంగ్రెస్ బీజేపీలు బాహాటంగా సహకరించుకోవడం వల్లే హుజురాబాద్‌లో ఓటమి పాలయ్యామన్నారు కొప్పుల. బీజేపీ, కాంగ్రెస్ సహకరించుకోవడంపై కాంగ్రెస్ సీనియర్లు కూడా ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బహిరంగంగా దుమ్మెత్తిపోస్తున్నారని చెప్పారు.

దళితబంధు కేసీఆర్ ఆలోచన: బండి సంజయ్‌పై కొప్పుల ఫైర్
దళిత బంధును ఆపే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు మంత్రి కొప్పల. హుజురాబాద్‌లో అందరకి దళిత బంధు అందుతుందని స్పష్టంచేశారు. దళిత బంధు అమలు ఇప్పటికే మొదలయ్యిందన్న కొప్పుల.. ఎన్నికల సమయంలో బీజేపీ ఫిర్యాదు వల్లే ఆగిందని ఆరోపించారు. దళితబంధు వెంటనే అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేయడం హాస్యాస్పదమన్నారు. దళిత బంధు దేశం లొనే కేసీఆర్ ఆలోచనతో తెలంగాణలో మొదలైన పథకమన్నారు. బీజేపీ చెబితేనో బండి సంజయ్ చెబితేనో మొదలు పెట్టిన పథకం దళిత బంధు కాదన్నారు. కేంద్రం నుంచి దళితులకు ఏం తెస్తారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే బండి సంజయ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు లాంటి పథకం పెట్టించాలని సవాల్ చేశారు. బీజేపీ నేతలు అబద్దాలతో మభ్యపెడుతున్నారని.. దళితులను మోసం చేస్తున్న పార్టీ బీజేపీ అని ధ్వజమెత్తారు. హుజూరాబాద్ ఉపఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయడం విడ్డూరమన్నారు. హుజురాబాద్‌లో ఏక్కడా లేని విధంగా బీజేపీ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిందని, దీన్ని అమలు చేసేందుకు బండి సంజయ్ కేంద్రంతో మాట్లాడాలని మంత్రి కొప్పుల డిమాండ్ చేశారు.
Recommended Video

ఈటలపై అభిమానంతోనే ఓటేశారు: కొప్పుల ఈశ్వర్
హుజురాబాద్‌లో ప్రజలు ప్రభుత్వ పథకాలను, సంక్షేమాన్ని చూడలేదని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈటలపై వ్యక్తిగత అభిమానంతో ఓటు వేశారని.. హుజురాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం కాదని స్పష్టం చేశారు. అయితే, హుజూరాబాద్‌లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు మంత్రి కొప్పల. తప్పులు చేస్తే సరిచేసుకుంటామన్నారు. హుజురాబాద్ ఓటమిపై ఆత్మపరీశీలన చేసుకుంటామని, పార్టీలో చర్చించుకుంటామని తెలిపారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓటు బ్యాంకు చెదిరిపోలేదని.. తమ ఓట్లు తమకు వచ్చాయని కొప్పుల తెలిపారు. టీఆర్‌ఎస్ అనేక గెలుపు ఓటమిలను చూసిందన్నారు. దేశ వ్యాప్తంగా 32 ఉప ఎన్నికలు జరిగితే ఒక ఎంపీ, 8 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications