నేను, ముఖ్యమంత్రిగానా!: సీఎం పదవిపై కెటిఆర్ ఏం చెప్పారు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాఖ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి పోస్ట్ పదవి పైన దృష్టిలేదని, కేవలం రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి పైనే ఉందని చెప్పారు.
సోమవారం నాడు కెటి రామారావు బిజీబిజీగా గడిపారు. ఉదయం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు టీ హబ్‌లో ఘన స్వాగతం పలికారు. ఆయనకు టి హబ్ గురించి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సెలెక్టివ్ మీడియాతోనూ మాట్లాడారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదవి పైన ఆయన మాట్లాడుతూ... తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక, ఆసక్తి లేవని చెప్పారు. ప్రస్తుతం తన దృష్టి ఐటీ అభివృద్ధి పైనే ఉందని చెప్పారు.

అంతకుముందు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఇన్ఫోసిస్ విశాల్ సిక్కాతో భేటీ అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ... ఇది సత్య నాదెళ్ల ప్రయివేటు పర్యటన అని చెప్పారు. ఆయన తన తండ్రిని కలిసేందుకు వచ్చారన్నారు.
గతంలో ఓసారి సత్య నాదెళ్ల వచ్చినప్పుడు తాను కలిశానని, టీ హబ్‌ను సందర్శించాలని సూచించానని, దానికి ఆయన అంగీకరించి, ఈసారి వచ్చారని చెప్పారు.
కాగా, ముఖ్యమంత్రి పదవి విషయంలో కెటిఆర్ పెదవి విప్పడం గమనార్హం. చాలా రోజులుగా... కెసిఆర్ తర్వాత ఎవరు? అనే చర్చ సాగుతోంది. కెసిఆర్ మరో పది ఇరవై ఏళ్లు రాజకీయాల్లో కొనసాగుతారు. అయినప్పటికీ కెసిఆర్ తర్వాత హరీష్ రావా లేక కెటిఆరా అనే చర్చ కొద్ది రోజుల క్రిత జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో కెటిఆర్.. మాట్లాడుతూ.. తన దృష్టి ప్రస్తుతానికి ఐటీ అభివృద్ధి పైనే అని చెప్పారు.












Click it and Unblock the Notifications