ఎవరూ బాగు పడలేదు! ఇది కేసీఆర్ అడ్డా: జేపీ నడ్డా విమర్శలపై కేటీఆర్, వేముల స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్: నాగర్‌కర్నూల్ నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ సర్కారుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలకు తెలంగాణ మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జేపీ నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని కేటీఆర్ మండిపడ్డారు. ఉప్పల్ స్కైవాక్ టవర్‌ను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను జైల్లో పెడుతామంటున్నారని.. అది ఎందుకో చెప్పాలన్నారు.

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అందిస్తున్నందుకా? కేసీఆర్ కిట్లు, డబుల్ డెడ్రూం ఇల్లు ఇస్తున్నందుకా? కేసీఆర్‌ను ఎందుకు జైలుకు పంపుతావ్? మాట్లాడటానికి ఓ హద్దు అదుపు ఉండాలి. ఈ 23 ఏళ్లలో కేసీఆర్‌తో పెట్టుకున్న ఓ ఒక్కరూ బాగుపడలేదు అని జేపీ నడ్డాపై కేటీఆర్ ధ్వజమెత్తారు. గత కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు ఉన్నాయని.. ప్రస్తుతం 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.

minister ktr

వేసవి కాలంలో నీటి కొరత సమస్య లేకుండా ఇబ్బందులను సీఎం కేసీఆర్ పరిష్కరించారన్నారు. నారపల్లి నుంచి ఉప్పల్ వరకు రహదారి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే నాలుగేళ్ల నుంచి రహదారి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్ చేసిన జాప్యంతోనే ఎంతో మంది ఉద్యమకారులు చనిపోయారని.. దానికి సోనియా గాంధీ కారణం కదా? అని ప్రశ్నించారు.

అవినీతి గురించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే పులి శాకాహారం గురించి మాట్లాడినట్లు.. హంతకుడు సంతాపం తెలిపినట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు. రూ. 50 లక్షల నోట్ల కట్టలతో దొరికి జైలుకెళ్లొచ్చిన వ్యక్తి నీతి ముచ్చట్లను మనం వినాలా? అని ప్రశ్నించారు కేటీఆర్. గత తొమ్మిళ్లలో ఒక్కో పనిచేసుకుంటూ హైదరాబాద్, తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా జేపీ నడ్డా విమర్శలపై మండిపడ్డారు. తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ నేతలు ఇక్కడి అభివృద్ధిపై విషం చిమ్మే మాటలే చెబుతున్నారని ధ్వజమెత్తారు. పదే పదే అవే అబద్ధాలు వల్లే వేస్తున్నారన్నారు. ఇక్కడి నేతలు రాసిచ్చిన పాత స్క్రిప్టునే ఎన్నిసార్లు చదువుతారని ప్రశ్నించారు. 'నడ్డా.. ఇది కేసీఆర్ అడ్డా.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు' అంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందా? రెండు పడక గదుల ఇళ్ల కోసం తాము రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. వీటికి కేంద్రంలోని బీజేపీ సర్కారు 1200 కోట్లు ఇచ్చిందన్నారు.

కేంద్రంలోని బీజేపీ సర్కారు పైసలివ్వకున్నా.. అవార్డులు ఇస్తుందన్నారు. కేసీఆర్ రైతు బంధును కాపీ కొట్టి పెట్టిన కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధిలో రైతులకు షరతులు విధించడం సిగ్గుచేటన్నారు. ధరణిని రద్దు చేసి మళ్లీ వీఆర్వో వ్యవస్థ తెచ్చి రైతులను గోస పెడతామనే ఆలోచన బీజేపీదని అన్నారు మంత్రి వేముల.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+