• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గోదావరి ట్రయల్ రన్: తలపై నీళ్లు చల్లుకున్న కేటీఆర్ (ఫోటోలు)

By Nageswara Rao
|

హైదరాబాద్: హైదరాబాద్ నగరవాసులకు త్వరలో మంచినీటిని అందించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటొందని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలోని ఘన్‌పూర్ వద్ద క్షేత్రగిరిపై నిర్మించిన రిజర్వాయర్ నుంచి గోదావరి జలాల తరలింపునకు చేపట్టిన ట్రయల్ రన్ నీటి విడుదలను ఆయన ప్రారంభించారు.

అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని నగరానికి, శివారు ప్రాంతాలకు తాగునీటి కష్టాలను తీర్చేందుకు ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. ఏళ్లుగా నగర వాసులు దాహార్తిని తీరుస్తున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీరా లాంటి ప్రాజెక్టులు ప్రస్తుతం అడుగంటి పోవడంతో గోదావరి జలాల తరలింపు అనివార్యమైందన్నారు.

కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు గోదావరి జలాలను తీసుకురావడాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ అందులో సఫలీకృతమయ్యారన్నారు. హైదరాబాద్ మహానగరానికి గోదావరి, కృష్ణా జలాలు సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందుకు అవసరమైన ప్రణాళికలు ప్రభుత్వం రూపొందించిందన్నారు.

టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కోతల్లేని విద్యుత్ సరఫరాకు విశేష కృషి చేసిందన్నారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల నగరంలోని ప్రజలకు రోజు వారీ నీటిని సరఫరా చేయలేకపోతున్నామన్నారు. జంట జలాశయాలతో పాటు సింగూర్, మంజీరా జలాలు సమృద్ధిగా ఉంటే కృష్ణా ఫేజ్-3, గోదావరి ప్రాజెక్టులతో నగరవాసులకు ఇంటింటి నల్లా నీరు ఇచ్చేందుకు ఆవకాశం ఉండేదన్నారు.

అయినప్పటికి సాధ్యమైనంత త్వరలో నగరంలోని ప్రజలకు ఇంటింటికి నల్లా నీరు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. గోదావరి జలాలు సుమారు 180 కి.మీ. నుంచి వస్తున్న నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారన్నారు.

సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా శ్రద్ధ వహించి నేషనల్ హైవే, అటవీశాఖ, రైల్వే, డిఫెన్స్ అనుమతులకు విశేష కృషి చేశారన్నారు. సీఎం నేతృత్వం వహిస్తున్న జలమండలికి ప్రభుత్వం అన్నివిధాల సహకారం అందించిందని తెలిపారు.

పంపింగ్, రిజర్వాయర్ నిర్మాణం, ట్రయల్ రన్ పనులను జలమండలి అధికారులు వేగంగా పూర్తి చేశారని అభినందించారు. డిసెంబర్ 15 వరకు గోదావరి జలాలు నగరానికి తెవాలని ప్రభుత్వం గడువు విధించినప్పటికి జలమండలి అధికారులు కృషిచేసి నిర్ధేశించిన సమయానికి ముందే శామీర్‌పేట మండలం ఘన్‌పూర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించారన్నారు.

గోదావరి ట్రయల్ రన్: 'తాగునీటి కష్టాలను తీర్చేందుకే'

గోదావరి ట్రయల్ రన్: 'తాగునీటి కష్టాలను తీర్చేందుకే'


హైదరాబాద్ తాగు నీటి అవసరాల కోసం 2007లో గత ప్రభుత్వాలు రూ.3375 కోట్లతో చేపట్టిన మౌలానా అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకం పూర్తయింది. కరీంనగర్ జిల్లాలో గోదావరిపై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా తాగునీటిని ఎత్తిపోసేందుకు ఈ పథకాన్ని చేపట్టారు. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాల వరకు 186 కిలోమీటర్లు మేర పైప్‌లైన్ నిర్మాణం చేపట్టారు. వీటి ద్వారా రోజుకు 176 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేసేలా రూపకల్పన చేశారు.

గోదావరి ట్రయల్ రన్: 'తాగునీటి కష్టాలను తీర్చేందుకే'

గోదావరి ట్రయల్ రన్: 'తాగునీటి కష్టాలను తీర్చేందుకే'


ఒక్కొక్క ఎంఎస్ పైపు 3మీటర్ల వ్యాసార్థం కలిగి ఉన్నాయన్నారు. నాలుగు పంపింగ్ కేంద్రాల్లో 9 పంపుల్లో 3 పంపులు స్టాండ్‌బై ఉంటాయన్నారు. గోదావరి ప్రాజెక్ట్‌లో భాగంగా నగరానికి తీసుకురవాల్సిన 172 ఎంజిడిల నీటిలో డిసెంబర్ మాసం నాటికి 86 ఎంజిడిల నీటిని నగర ప్రజల అవసం కోసం అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోదావరి జలాల తరలింపు పనులు చివరిదశకు చేరుకున్నాయి.

 గోదావరి ట్రయల్ రన్: 'తాగునీటి కష్టాలను తీర్చేందుకే'

గోదావరి ట్రయల్ రన్: 'తాగునీటి కష్టాలను తీర్చేందుకే'


మొదటి దశ కింద 87 ఎంజిడిల నీటిని నగరానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి జలాల తరలింపునకు సంబంధించి రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు పైప్‌లైన్‌ల నిర్మాణం పనులు పూర్తిచేశారు. దాదాపు రూ.3775కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పనులను మొత్తం మూడు ప్యాకేజీల కింద నిర్మాణం చేపట్టారు. ఇందులో మొదటి ప్యాకేజీలో 80ఎంఎల్ సామర్ధ్యం కలిగిన రిజర్వాయర్ బొమ్మకల్ వద్ద నిర్మించారు.

 గోదావరి ట్రయల్ రన్: 'తాగునీటి కష్టాలను తీర్చేందుకే'

గోదావరి ట్రయల్ రన్: 'తాగునీటి కష్టాలను తీర్చేందుకే'


అంతే కాకుండా ముర్మూరు నుండి బొమ్మకల్ వరకు 53 కిలోమీటర్లు పైప్‌లైన్ నిర్మాణం పనులను చేపట్టారు. రెండో ప్యాకేజీ కింద బొమ్మకల్ నుండి కొండపాక వరకు 72 కిలోమీటర్లు పైప్‌లైన్ నిర్మాణం పనులు పూర్తయ్యయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన రిజర్వాయర్ (80ఎంఎల్)ను మల్లారం వద్ద నిర్మించారు. 3 మెగావాట్ల విద్యుత్తుతో ఈ పంపింగ్ నడుస్తుందన్నారు. అక్టోబర్ 23న ప్రారంభమైన ట్రయల్ రన్ రికార్డు స్థాయిలో నెల రోజుల్లో పూర్తి చేయడం విశేషమన్నారు.

English summary
Minister KTR begins Godavari water trail run at Medchal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X