• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బండికి కేటీఆర్ బస్తీమే సవాల్ : ద‌మ్ముంటే గంగుల మీద పోటీ చేసి గెలువు.. బీజేపీకి గుణ‌పాఠం త‌ప్ప‌దు..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్‌పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. కరీంనగర్ ఎంపీగా గెలిచి మూడేళ్లైనా రూ. 3 కోట్ల పని కూడా చేయలేదని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కనీసం పార్లమెంటులో నోరు కూడా మెదపడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణపై కేంద్రం వివక్షచూపుతోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని బండి సంజయ్ ఏనాడైనా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారా ? అని కేటీఆర్ నిలదీశారు. ప్రజలు మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువ‌త‌ను చెడ‌గొడుతున్న బండి..

యువ‌త‌ను చెడ‌గొడుతున్న బండి..

హిందూ, ముస్లీం పంచాయతీ తప్ప బండి సంజయ్‌కు మరేమి రాదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. మతం పిచ్చి కడుపు నింపదని హితవు పలికారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతూ యువతను చెడగొడుతున్నారని నిప్పులు చెరిగారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. సుమారు 1,067 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మార్క్‌ఫెడ్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ మూడేళ్లలో కరీంనగర్ ప్రజల కోసం ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఓ గుడి అయినా తెచ్చావా.. క‌ట్టావా? అని ప్రశ్నించారు. ఏం చేశావని ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని నిలదీశారు. వినోద్ కుమార్ ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదా వచ్చిందని తెలిపారు.

 ద‌మ్ముంటే గంగుల మీద పోటీ చేసి గెలువు

ద‌మ్ముంటే గంగుల మీద పోటీ చేసి గెలువు


బండి సంజయ్‌కి నిజంగా దమ్ముంటే, ధైర్యం ఉంటే మంత్రి గంగుల కమాలాకర్‌పై పోటీ చేసి గెలవాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. కమలాకర్‌ను లక్ష ఓట్ల మేజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. బండి సంజయ్‌కి ఏం చేతకాక.. నోటికి ఇష్టం వచ్చినట్లు సీఎం కేసీఆర్‌ని తిడుతూ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అన్నివిధాల ప్రగతి పథంలో తీసుకెళ్తున్నామన్నారు.. దేశానికి అన్నంపెట్టే మొదటి నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని కేటీఆర్ తెలిపారు. కరీంనగర్‌కు కేసీఆర్ ప్రభుత్వం మెడికల్ కాలేజీ కేటాయించాం.. అది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానుందని తెలిపారు.

Recommended Video

Etela Rajender Exclusive : ప్రజలు TRS ని Telangana నుంచే గెంటేస్తారు | Oneindia Telugu
 క‌రీంన‌గ‌ర్‌కు 24 గంట‌ల పాటు నీళ్లు..

క‌రీంన‌గ‌ర్‌కు 24 గంట‌ల పాటు నీళ్లు..


కేంద్రానికి ఎన్నో సార్లు విజ్ఞప్తులు చేసినా కరీంనగర్, సిరిసిల్లా నేతన్నలకు పవర్ లూమ్ కస్టర్ ఇవ్వకుండా కేంద్రం మొండి చేయి చూపిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సాయం చేయకున్నా.. కాళ్లేశ్వరం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలను సస్యశ్యామలం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్‌కుపైసా పని చేయలేదని విమర్శించారు. ఒకప్పుడు తాగినీటికి చాలా ఇబ్బంది ఉండేది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు ఇస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కరీంనగర్‌కు 24 గంటల పాటు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

English summary
Minister KTR Slam to Telangana BJP Chief Bandi Sanjay
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X