తెలంగాణాకు ఉద్యమాలు కొత్తకాదు.. మీకిప్పుడు సెప్టెంబర్17 గుర్తొచ్చిందా? మంత్రి కేటీఆర్ ఫైర్!!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎనిమిది సంవత్సరాలలో కేంద్రానికి గుర్తురాని సెప్టెంబర్ 17 ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.

అమిత్ షా రాష్ట్రానికి నిధులు తెస్తారా? ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప
తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా నిధులు తెస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి వెళ్ళిపోతారు అంటూ ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేనిది కులం, మతం అంటూ కొత్తగా గొడవలు సృష్టిస్తున్నారని, మత ఘర్షణలు సృష్టిస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

భారత్ లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు జాతీయ సమైక్యతకు చిహ్నం
భారత్ లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజు ను గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల వేడుకలు నిర్వహిస్తుందని పేర్కొన్న మంత్రి కేటీఆర్ త్యాగధనుల ను స్మరించుకుంటూ వేడుకలు నిర్వహించుకుంటున్నాం అని గుర్తు చేశారు. తెలంగాణకు పోరాటాలు కొత్త కాదని పేర్కొన్న కేటీఆర్ 1948 లో రాచరిక ప్రభువు పై, 1956 లో ఆంధ్రా లో విలీనమై నప్పుడు, 1960 దశకంలో తెలంగాణ కోసం, 2001 లో కేసిఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ కోసం మలిదశ పోరాటం జరిగి లక్ష్యాన్ని ముద్దాడింది తెలంగాణ రాష్ట్రం అని పేర్కొన్నారు.

కేసీఆర్ సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టటం హర్షణీయం
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కు తెలంగాణ సచివాలయం కు పేరు పెట్టడం హర్షణీయం అని పేర్కొన్న మంత్రి కేటీఆర్ సీఎం కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. నాడు డా బి ఆర్ అంబేద్కర్ దార్శనికత వల్లే, రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు. స్వేచ్చ, న్యాయం, సౌభ్రాతృత్వం కాంక్షించిన డా బి ఆర్ అంబేద్కర్ గొప్పదనం తెలిసేలా సచివాలయానికి ఆయన పేరు పెట్టడం తెలంగాణ ప్రభుత్వానికి ఆయన పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు.

మతపిచ్చి, వైషమ్యాల మాయలోపడితే వెనుకబాటు
తెలంగాణ వచ్చిన తర్వాత సంక్షేమానికి తెలంగాణ ట్రేడ్ మార్క్ గా నిలిచిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలతో అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్నామన్నారు. ఎంతో మంది త్యాగాలతో సిద్ధించిన తెలంగాణ ను కులం, మతం పేరుతో విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. మతపిచ్చి, వైషమ్యాల మాయలోపడితే తెలంగాణ దశాబ్దాల వెనుకబాటు గురవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

చిల్లరమాటలతో ఒరిగేది ఏమీ లేదు
చిల్లర మాటలు, పంచాయితీ లతో తెలంగాణ కు ఒరిగేదేమీ ఉండదు అన్న మంత్రి మెగా టెక్స్టైల్ క్లస్టర్ సిరిసిల్లకు ఇవ్వాలని అడిగితే కేంద్రం స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు. దేశమంతా సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే సమైక్యత వేడుకలు జరుపుకుంటున్నామని, భవిష్యత్తు వైపు చూస్తేనే బంగారు తెలంగాణ, ఆదర్శ భారత నిర్మాణం అవుతుంది అంటూ మంత్రి కేటీఆర్ తెలిపారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications