Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పచ్చగా ఉన్న తెలంగాణాలో చిచ్చుపెట్టే చిల్లరప్రయత్నం చేస్తున్న మోడీ సర్కార్: మండిపడిన కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రంలోని బిజెపి సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లను చేసి బిజెపి ని టార్గెట్ చేస్తున్న కేటీఆర్ తనదైన శైలిలో మండిపడుతున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా బిజెపి ని టార్గెట్ చేసిన కేటీఆర్ కేంద్రంలో అధికారంలో ఉంది మోడీ ప్రభుత్వం కాదు ఏ డి ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రభుత్వం అని మోడీ ప్రభుత్వాన్ని కేటీఆర్ టార్గెట్ చేశారు.

ప్రజల దృష్టి మరల్చే కుట్ర చేస్తున్న కేంద్రం

అసలు దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర చేస్తున్నారని, మండిపోతున్న పెట్రో ధరల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర చేస్తున్నారని కేంద్రంలోని బీజేపీ పై నిప్పులు చెరిగారు కేటీఆర్. అంతేకాదు భారమవుతున్న నిత్యవసరాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర జరుగుతోందని, ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర జరుగుతోందని కేటీఆర్ మండిపడ్డారు. ఇక ఈ కుట్రను కని పెట్టకపోతే దేశానికి, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టం జరుగుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

విద్వేషం కోసం అధర్మం కోసం.. అనేది బీజేపీ అసలు రాజకీయ విధానం

దేశం కోసం.. ధర్మం కోసం... అనేది బీజేపీ అందమైన నినాదం కానీ విద్వేషం కోసం.. అధర్మం కోసం అనేది అసలు రాజకీయ విధానం అంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు. హర్ ఘర్ జల్ అన్నారు కానీ హర ఘర్ జహర్, హర దిల్ మే జహర్ అంటూ, ప్రతి ఇంట్లో విషాన్ని, ప్రతి మనసులో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్.

ద్వేషం కాదు దేశం ముఖ్యమన్న మంత్రి కేటీఆర్

పచ్చగా ఉన్న తెలంగాణాలో చిచ్చు పెట్టే చిల్లర ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విషప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా దేశంలోని సోషల్ ఫ్యాబ్రిక్ ను దెబ్బతీసే కుతంత్రాన్ని కేంద్రంలోని బిజెపి చేస్తోందని, మిత్రులారా గుర్తుంచుకోండి అంటూ మంత్రి కేటీఆర్ హితవు పలికారు. ద్వేషం కాదు దేశం ముఖ్యమని పేర్కొన్న ఆయన ఉద్వేగాల భారతం కాదు ఉద్యోగాల భారతం ముఖ్యమంటూ తనదైన శైలిలో కేంద్ర సర్కారు తీరును తెలియజేసే ప్రయత్నం చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గోడమీద పిల్లి

ఇక అంతకుముందు మునుగోడు ఉపఎన్నిక ఎందుకు ఎందుకు వచ్చింది గోడమీద పిల్లి కోసమే వచ్చింది అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేశారు మంత్రి కేటీఆర్. మొదట రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం లేదని చెప్పారని, ఆతర్వాత బీజేపీలో చేరారని తనదైన శైలిలో రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేశారు మంత్రి కేటీఆర్. ఇక గోపీ అంటూ ఏళ్ళ తరబడి అవకాశం కోసం చూసి ఇప్పుడు గోడ దూకారని మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+