Etela Rajender, KTR: ఈటలను పలకరించిన కేటీఆర్..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పలకరించారు. శాసనసభలో ఈటల వద్దకు వెళ్లిన కేటీఆర్.. ఆయన్న కౌగిలించుకున్నారు. ఇద్దరు నేతలు ఒకరినొకరు హత్తుకున్నారు. సూపర్ 10 నిమిషాల పాటు వారు యోగక్షేమాలను ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. గతంలో కూడా ఈటల రాజేందర్ కేటీఆర్ పలకరించారు. ఒక్కప్పుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ కీలక నేతగా ఉండేవారు.

ఓ సమయంలో అప్పటీ టీఆర్ఎస్ పార్టీలో నంబర్ 2 నేతగా ఉండేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ నిర్వహించారు. రెండో సారి అధికారంలోకి వచ్చినప్పుడు వైద్య శాఖ నిర్వహించారు. అయితే ఈటల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ మంత్రులు వ్యాఖ్యలు చేయడం.. ఈటల రాజేందర్ భూముల కబ్జా చేశారని ఆరోపించడంతో అయన్ను పొమ్మనకుండానే పొగ పెట్టారు. దీంతో ఈటల రాజేందర్ బీఆర్ఎస్ బయటకు వచ్చారు. బీజేపీలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నికల గెలిచారు.

 Minister KTR

అటు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేటీఆర్ ను కలిశారు. తన నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులపై కేటీఆర్ తో చర్చించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు నిర్వహించాలని బీఏసీ భేటీలో నిర్ణయించారు. శుక్రవారం వరదలపై చర్చ జరపనున్నారు. 5వ తేదీ రోజు వివిధ బిల్లలుపై చర్చిస్తారు. ఆదివారం రోజు అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.

కానీ స్పీకర్, ప్రభుత్వం మాత్రం అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులు జరపాలని నిర్ణయించారు. అంతకు ముందు అసెంబ్లీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులు అర్పించారు. సాయన్న కొద్ది నెలల క్రితం అనారోగ్య సమస్యతో కన్నుమూశారు. సాయన్న సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సంతాప తీర్మాణాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బలపరిచారు. ఈ సందర్భంగా ప్రజలకు సాయన్న చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+