హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇలా చేయండి.. కరోనా వ్యాప్తి నియంత్రణపై మెట్రో,ఆర్టీసీలకు కేటీఆర్‌ కీలక సూచన

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా పాజిటివ్ కేసు బయటపడ్డప్పటి నుంచి ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్య శాఖ ద్వారా పలు సలహాలు,సూచనలు జారీ చేసింది. అలాగే కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించి వారిని ఐసోలేషన్‌లో చేర్చే ప్రయత్నాలు చేస్తోంది. కరోనా గాలి ద్వారా సోకే అవకాశం ఉండటంతో.. ప్రజా రవాణాపై కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించేవారికి కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ మెట్రో,ఆర్టీసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

కరోనా వైరస్ పట్ల కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో తీసుకుంటున్న జాగ్రత్తలకు సంబంధించి ఓ ఫోటో షేర్ చేసిన కేటీఆర్.. ఇక్కడి మెట్రో,ఆర్టీసీ అధికారులు కూడా దాన్ని ఫాలో కావాలని సూచించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆ దిశగా అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. కాగా,కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు ఎక్కువగా తాకే బస్సు డోర్ హ్యాండిల్స్,లోపల నిలుచుకోవడానికి పట్టుకునే హ్యాండిల్స్‌ను ఎప్పటికప్పుడు క్లోరిన్‌తో శుభ్రం చేస్తున్నారు. తద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రింవచ్చునని భావిస్తున్నారు. కాబట్టి ఇదే విధానాన్ని తెలంగాణలోనూ ఫాలో కావాలని కేటీఆర్ సూచించారు.

minister ktr requests hyd metro and rtc to follow bengaluru measures

ఇక కరోనా పాజిటివ్ కేసుగా తేలిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినవారి సంఖ్యను 88గా గుర్తించారు. వారందరి వివరాలు సేకరించిన వైద్య అధికారులు వీరిలో 45 మందిని గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. కరోనా పాజిటివ్ బయటపడ్డ మహేంద్ర హిల్స్‌లో.. పేషెంట్ ఇంటికి సమీపంలోని స్కూళ్లల్లో చదువుతున్న పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

Recommended Video

AP CM YS Jagan Review Meeting On Corona Virus | ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి! | Oneindia Telugu

blockquote class="twitter-tweet blockquote">

Request MDs of @hmrgov @ltmhyd to start the same in HYD Metro Rail immediately

Also Request Transport Minister @puvvada_ajay Garu to direct TSRTC to do the same asap https://t.co/wYA9AfIBGj

— KTR (@KTRTRS) March 4, 2020

English summary
Minister KTR suggested instructions to take measures in Hyd Metro and RTC to prevent spreading Coronavirus.He said to follow the Bengaluru RTC measures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X