కేసీఆర్ పేరు చెప్పి బ్లాక్ మెయిలా: ఎమ్మెల్యేపై కేటీఆర్ సీరియస్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కరీంనంగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పైన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. మైనింగ్ శాఖ అంశానికి సంబంధించి అతను ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు.

గ్రానైట్‌కు సంబంధించిన అంశంపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రానైట్ క్వారీల నుంచి వాహనాలు ఓవర్ లోడ్‌తో వెళ్లకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారట. ఆయన మాట్లాడుతుండగా, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్యలో కల్పించుకొని, గతంలో తాము చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్ పోస్టులను ఎత్తివేశారని చెప్పారని అంటున్నారు. ఆయన అదే విషయాన్ని ఒకటికి రెండుసార్లు చెప్పారు.

Also Read: బాధపడిన కోదండరాం, తెలియదని కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్య

Minister KTR serious on MLA!

దీంతో చిర్రెత్తుకొచ్చిన కేటీఆర్.. పదేపదే ముఖ్యమంత్రి పేరు చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని సీరియస్ అయినట్లుగా తెలుస్తోందని మీడియాలో కథనం వచ్చింది. దీంతో ఆ ఎమ్మెల్యే మౌనం దాల్చారని చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Minister KT Rama Rao lashed out at MLA.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి