నాకు మంత్రి పదవే ఎక్కువ: 'సీఎం'పై కేటీఆర్, తెరాస అధికారంలోకి రాకుంటే సంచలన నిర్ణయమే!

Recommended Video

    Telangana Elections 2018: చంద్రబాబు నాయుడు పై కేటీఆర్ మండిపాటు | Oneindia Telugu

    హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీలు ఇచ్చే భుజకీర్తులు తమకు అవసరం లేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు గురువారం చెప్పారు. ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు.

    ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండోసారి తెరాస అధికారంలోకి రాకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. తన సవాల్ స్వీకరించే దమ్ము తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉందా అని చాలెంజ్ చేశారు. ఏడు సర్వేల్లో ఆరు సర్వేలు తెరాస వైపు మొగ్గాయని చెప్పారు.

    గెలుస్తామనే నమ్మకంతోనే సవాల్ విసిరా

    గెలుస్తామనే నమ్మకంతోనే సవాల్ విసిరా

    తాము గెలుస్తామని గట్టి నమ్మకం ఉందని, తమ పరిపాలనే గెలిపిస్తుందని కేటీఆర్ చెప్పారు. అందుకే తాము గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేసానని అన్నారు. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 7 సర్వేల వరకు వచ్చాయని, అందులో తెరాసకు ఆరు సర్వేలు అనుకూలంగా వచ్చాయని కేటీఆర్ చెప్పారు. కానీ అసలు సర్వే డిసెంబర్ 11న వస్తుందని చెప్పారు.

    బీజేపీ ఐదుగురు ఎమ్మెల్యేలను ఓడిస్తాం

    బీజేపీ ఐదుగురు ఎమ్మెల్యేలను ఓడిస్తాం

    బీజేపీకి ఇప్పుడు ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలను మేం ఓడిస్తామని కేటీఆర్ చెప్పారు. ఆ పార్టీకి 100 సీట్లలో డిపాజిట్లు రావని జోస్యం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా తమ పాలనను మెచ్చుకున్నారని చెప్పారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వంటి వారు కూడా ప్రశంసించారని గుర్తు చేశారు. ఆరువారాల పాటు గాంధీ భవన్ మూసేస్తారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ల ధర్నాల కోసమే ధర్నాచౌక్ అన్నారు. 16 రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని చెప్పారు. ఎన్నికల తర్వాత డ్రైవర్ మారొద్దని, కారు ఆగవద్దని వ్యాఖ్యానించారు. తద్వారా కేసీఆర్ మళ్లీ సీఎం అవ్వాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు.

     ఖాళీలన్నీ నింపినా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు

    ఖాళీలన్నీ నింపినా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు

    డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో అవసరమైన మార్పులు తెస్తామని చెప్పారు. రేషన్ కార్డులు ఇవ్వడం, నాళాలు శుభ్రం చేయడం సీఎం పని కాదన్నారు. హైదరాబాదును కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తెరాస అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంటుందన్నారు. విద్య, వైద్య రంగంలో ఎన్నో మార్పురు తీసుకు వచ్చామని చెప్పారు. హైదరాబాదును కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 163 నివాసాలకు నీళ్లు ఇస్తే మిషన్ భగీరథ పూర్తవుతుందని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీలేకుండా పని చేశామన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వమే చెబుతోందన్నారు. రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చామని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పని చేశామని చెప్పారు. రాష్ట్రంలోని ఖాళీలన్నీ నింపినా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదన్నారు. పాలనలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని, 16 రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. భవిష్యత్తు తరాల కోసం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అన్నారు. రియల్ ఎస్టేట్ రంగం దేశవ్యాప్తంగా కుదేలైనా తెలంగాణలో దూకుడు మీద ఉందని చెప్పారు. విశ్వనగరాలు రాత్రికి రాత్రే తయారు కావని చెప్పారు. కాంగ్రెస్ వల్లే నోటిఫికేషన్లు ఆగిపోయాయని చెప్పారు. రాజకీయ సమీకరణాల వల్ల మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పారు.

     ఉత్తర, దక్షిణ తేడాలు లేవు

    ఉత్తర, దక్షిణ తేడాలు లేవు

    తమకు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అన్న బేధం లేదని కేటీఆర్ చెప్పారు. రాజకీయ విశ్లేషకులు ఏమి అనుకున్నా ప్రజలు చాలా తెలివైన వాళ్లని చెప్పారు. చిరస్మరణీయమైన, అసాధారణమైన విజయాన్ని నమోదు చేయబోతున్నామని చెప్పారు. గెలుపు విషయంలో తనకు ఎలాంటి అపనమ్మకం లేదన్నారు.

    ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదు

    ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదు

    తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని కేటీఆర్ చెప్పారు. తాను తెలంగాణకు వస్తే చానని అనుకున్నానని, మంత్రిగా అవుతానని కూడా అనుకోలేదని, మంత్రి పదవే తనకు ఎక్కువ అనుకుంటానని, ఇంతకంటే పెద్ద పదవులు చేపట్టాలన్న దురాశ లేదని చెప్పారు. కేసీఆర్ మరో పదిహేనేళ్లు సీఎంగా ఉండాలని కోరిక తప్ప మరొకటి లేదన్నారు. తమకు ఎవరి పట్ల సాఫ్టుకార్నర్ లేదని స్పష్టం చేశారు. పలువురు నేతలపై అధికారులు, ప్రజలు ఫిర్యాదు చేసిన టిక్కెట్ ఇచ్చారు కదా అని ప్రశ్నిస్తే.. అది ప్రజలు చూసుకుంటారని సమాధానం చెప్పారు.

     మేం గెలిస్తే కేసీఆర్ సీఎం.. మరి మీరు గెలిస్తే

    మేం గెలిస్తే కేసీఆర్ సీఎం.. మరి మీరు గెలిస్తే

    గతంలో మోడీ, చంద్రబాబులు కూడా అసెంబ్లీని ముందుగానే రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. కేసీఆర్ పోరాటయోధుడుగానే కాకుండా మంచి పరిపాలనా దక్షుడిగా నిరూపించుకున్నారని జైట్లీ అన్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పుడు చాలా దుష్ప్రచారం చేశారన్నారు. సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి బయటకు రానక్కరలేదన్నారు. సీఎం దర్బారులో కూర్చొని సమస్యలు తీర్చడం అంటే పాలన పడకేసినట్లే అన్నారు. మేం గెలిస్తే కేసీఆర్ సీఎం అని, కూటమి గెలిస్తే ఎవరూ ముఖ్యమంత్రో చెప్పగలరా అని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లలో అందరి అనుమానాలను తాము నివృత్తి చేశామని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+